• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ట్రైనీ నర్సుపై డాక్టర్ అఘాయిత్యం, జలుబు తగ్గుతుందంటూ మత్తు ఇంజక్షన్ ఇచ్చి..

By Ramesh Babu
|
  Trainee Nurse Accuses Senior Doctor

  కోయంబత్తూర్: జలుబు చేసి జ్వరమొచ్చిందని, తగ్గేందుకు ఏదైనా మందు ఇమ్మని అడిగిన ఓ ట్రైనీ నర్సును డాక్టర్ ఏం చేశాడో తెలుసా? తన గదిలోకి తీసుకెళ్లి జలుబుకు మందు ఇస్తున్నానంటూ మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆపైన ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించాడు.

  బంగ్లాదేశ్ టు హైదరాబాద్: అమ్మాయిల అక్రమ రవాణా, బానిస కూలీలుగా, మసాజ్ పార్లర్లలో, వ్యభిచారం!

  అంత మత్తులోనూ ఆ ట్రైనీ నర్సు అతడ్ని ప్రతిఘటించింది. ఎలాగోలా అతడి బారినుంచి తప్పించుకుని గదిలోంచి బయటికొచ్చి ఆసుపత్రి వరండాలో పడిపోయింది. అక్కడున్న వారు ఆమెను కాపాడి ఏం జరిగిందో తెలుసుకున్నారు. ఆపైన పోలీసులు రంగ ప్రవేశం చేసి సదరు డాక్టర్‌ను అరెస్టు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు...

  భువనగిరి కేంద్రంగా అమ్మాయిలను ముగ్గులోకి దింపే హాట్ కాలింగ్ గ్యాంగ్!

  ప్రాక్టికల్స్ కోసం...

  ప్రాక్టికల్స్ కోసం...

  తమిళనాడు రాష్ట్రంలోని డిండిగల్ జిల్లా కొడైకెనాల్‌కు చెందిన యువతి డిండిగల్‌లో ఉన్న ఓ ప్రైవేటు నర్సింగ్ కాలేజీలో నర్సింగ్ డిప్లొమా ఫస్టియర్ చదువుతోంది. కొన్ని వారాల క్రితం ఆ కోర్స్‌లో భాగంగా ప్రాక్టికల్స్ కోసం ఆమెను కాలేజీ యాజమాన్యం కోయంబత్తూరులోని సింగనల్లూరు పట్టణంలో ఉన్న ఏఆర్ఆర్ మెడికల్ సెంటర్‌కు పంపించింది.

  ట్రైనీ నర్సుపై కన్నేసిన డాక్టర్...

  ట్రైనీ నర్సుపై కన్నేసిన డాక్టర్...

  నర్సింగ్ కాలేజీ నుంచి మొత్తం 11 మంది అమ్మాయిలు ప్రాక్టికల్స్ కోసం కోయంబత్తూరులోని సింగనల్లూరు పట్టణంలో ఉన్న ఏఆర్ఆర్ మెడికల్ సెంటర్‌కు వచ్చారు. దాని ఛైర్మన్ డాక్టర్ కె.టి.రవీంద్రన్ ఛైర్మన్‌ వీరిలో ఒక ట్రైనీ నర్సుపై కన్నేశాడు.

  మత్తు ఇంజక్షన్ ఇచ్చి...

  మత్తు ఇంజక్షన్ ఇచ్చి...

  సోమవారం తన విధులకు హాజరైన ట్రైనీ నర్స్ జలుబు, జ్వరంతో బాధపడుతోంది. ఆమెను పరామర్శించిన డాక్టర్ రవీంద్రన్ తగ్గడానికి మందు ఇస్తాను రమ్మంటూ ఆమెను తన ఛాంబర్‌లోకి పిలిచాడు. అతడి ఉద్దేశాన్ని గ్రహించలేని ట్రైనీ నర్స్ గదిలోకి వెళ్లింది. టాబ్లెట్లతో త్వరగా జలుబు తగ్గదని, ఇంజక్షన్ ఇస్తానంటూ డాక్టర్ రవీంద్రన్ ఆమెకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు.

  పెనుగులాడి.. తప్పించుకుని...

  పెనుగులాడి.. తప్పించుకుని...

  ఇంజక్షన్ ప్రభావంతో కాసేపటికి మత్తులోకి జారుకున్న ఆమెపై అతడు తన గదిలోనే అత్యాచారానికి ప్రయత్నించాడు. అయితే అప్పటికి పూర్తిగా మత్తు ఎక్కకపోవడంతో డాక్టర్ ప్రయత్నాన్ని ఆ ట్రైనీ నర్స్ పసిగట్టింది. అతడ్ని తీవ్రంగా ప్రతిఘటించింది. పెనుగులాడి ఎలాగోలా తప్పించుకుని డాక్టర్ ఛాంబర్ నుంచి బయటికి వచ్చింది. అయితే మత్తు ప్రభావం కారణంగా నడవలేక ఆసుపత్రి వరండాలో పడిపోయింది.

   డాక్టర్ బెదిరింపులు...

  డాక్టర్ బెదిరింపులు...

  మత్తులో ఉన్న ట్రైనీ నర్సును తోటి అమ్మాయిలు తీసుకొని వెళ్లి జరిగినదంతా డాక్టర్ భార్యకు వివరించారు. మరోవైపు జరిగిన ఉదంతం గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుందని డాక్టర్ రవీంద్రన్ బాధితురాలిని బెదిరించాడు. అయినా ఆమె లొంగకుండా విషయాన్ని కోయంబత్తూర్ చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసింది.

   డాక్టర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు...

  డాక్టర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు...

  కోయంబత్తూర్ చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ సులేఖ దీని గురించి మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ట్రైనీ నర్సునుంచి లిఖిత పూర్వక ఫిర్యాదు తీసుకుని ఏఆర్ఆర్ మెడికల్ సెంటర్‌కు వెళ్లి డాక్టర్ రవీంద్రన్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

  English summary
  A doctor, who heads a hospital in Coimbatore, has been arrested for sedating and then sexually assaulting a minor nursing student. Dr K T Ravindran, chairman of ARR Medical Centre in Singanallur, was arrested on Wednesday for sexually assaulting the 17-year-old student. The student was taking practical training in the hospital. Police said the minor girl had fever and told Dr Ravindran about her health condition. He allegedly administered sedative to the girl and molested her in his chamber. The incident happened on February 5. Police said the girl, who hails from Kodaikanal in Dindigul district, was studying in a private nursing college in Dindigul. She was sent to ARR Medical Centre for practical training by the college a few weeks ago.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X