LPG cylinder: భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
న్యూఢిల్లీ: నేటి నుంచి కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు ధరలను పెంచినట్లు ప్రకటించాయి. పెంచిన 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ (LPG cylinder) ధర రూ. 209 అక్టోబర్ 1 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ పెరుగుదల తర్వాత ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ రిటైల్ అమ్మకాల ధర రూ. 1731గా ఉంటుందని పలు నివేదికలు పేర్కొన్నాయి.
కాగా, సెప్టెంబర్ నెల ప్రారంభంలో కేంద్రమంత్రివర్గం ఉజ్వల పథకం కింద అదనంగా 75 లక్షల కొత్త ఎల్పీజీ కనెక్షన్లను ఆమోదించింది. ఇది వచ్చే మూడేళ్లలో ఇవ్వబడతాయి. ఈ కనెక్షన్లపై మొత్తం వ్యయం రూ. 1650 కోట్లు కేంద్రం భరించనుంది. ఉజ్వల పథకం కింద అందిస్తోన్న డిపాజిట్ రహిత కనెక్షన్ల కొనసాగింపుగా ఈ కొత్త కనెక్షన్లు ఉంటాయని సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

కలపపై ఆధారపడి వంటలు చేసుకునే గ్రామీణ కుటుంబాల్లోని మహిళల కోసం ఈ 75 లక్షల కొత్త కనెక్షన్లు ఇవ్వనున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. ఈ డిపాజిట్ రహిత కనెక్షన్లను ఇవ్వడానికి అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని, ఆ తర్వాత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తిరిగి చెల్లిస్తాయని తెలిపారు.
కాగా, ఇటీవల గృహ వినియోగానికి ఉపయోగించే ఎల్పీజీ గ్యాంస్ సిలిండర్‌పై రూ. 200లు కేంద్రం తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో రూ. 900లకే గ్యాస్ సిలిండర్ లభిస్తోంది. ఇక, ఉజ్వల వినియగదారులకు ఏకంగా 400 రూపాయల వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్ పొందే వారికి మరో 200 రూపాయలు తగ్గింపు ఇచ్చింది. అంటే వీరికి కేవలం 700 రూపాయలకే గ్యాస్ సిలిండర్ లభించనుంది. తగ్గించిన ధరలు తక్షణమే అమల్లోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.












Click it and Unblock the Notifications