గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ..! లెక్కలతో సహా..!

కొత్త ఆర్ధిక సంవత్సరంలో కేంద్రం వాణిజ్య గ్యాస్ (LPG) వినియోగదారులకు భారీ షాకిచ్చింది. సిలెండర్ పై ఏకంగా 195 రూపాయల వరకూ పెంచేసింది. దీంతో వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. అయితే ఇళ్లకు వాడే డొమిస్టిక్ గ్యాస్ సిలెండర్లు, చమురు ధరల్ని మాత్రం పెంచలేదు. ఈ నేపథ్యంలో తర్వాత పెరిగేది ఈ ధరలే అన్న ఆందోళన వినియోగదారుల్లో మొదలైంది. దీనిపై కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వశాఖ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది.

పరిశ్రమలు, హోటళ్లు ఉపయోగించే వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలపై నియంత్రణ లేదని, అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా వాటిపై నిర్ణయాలు ఉంటాయని కేంద్రం తెలిపింది. వీటిని సాధారణంగా నెలవారీగా సవరిస్తారని పేర్కొంది. దేశంలో వినియోగించే మొత్తం ఎల్‌పిజిలో వీటి వినియోగం 10% కంటే తక్కువగా ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. ప్రపంచ ఎల్‌పిజి సరఫరాలలో 20-30% హార్ముజ్ జలసంధిలో నిలిచిపోవడం వల్ల, సౌదీ కాంట్రాక్ట్ ధర మార్చిలో $542/MT నుండి ఏప్రిల్‌లో $780/MTకి 44% పెరగడంతో, ఏప్రిల్ 1న వాణిజ్య సిలిండర్ ధర పెరిగిందని స్పష్టం చేసింది.

Commercial LPG Price Hiked Due to Global Surge Domestic Gas and Fuel Rates Remain Frozen

అయితే ఇళ్లకు వాడే గ్యాస్ సిలెండర్ల ధరల్లో ఎలాంటి మార్పూ లేదని తెలిపింది. 14.2 కేజీల సిలిండర్ రూ.913కే కొనసాగుతుందని, అలాగే పీఎం ఉజ్వల్ యోజన లబ్ధిదారులకు రూ.613కే సిలెండర్లు అందిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే. చమురు కంపెనీలు ఒక్కో సిలిండర్‌పై రూ.380 తక్కువ వసూలు చేస్తున్నాయని వెల్లడించింది. దీంతో మే నెలాఖరు నాటికి వాటి నష్టాలు రూ.40,484 కోట్లకు చేరుకుంటాయని తెలిపింది. గతేడాది కూడా అధిక అంతర్జాతీయ ఎల్‌పిజి ధరల నుండి ప్రజల్ని కాపాడటానికి మొత్తం రూ.60వేల కోట్ల నష్టాలలో.. రూ.30వేల కోట్లను చమురు ప్రభుత్వ రంగ సంస్థలు, మరో రూ.30వేల కోట్లను ప్రభుత్వం భరించినట్లు తెలిపింది.

Commercial LPG Price Hiked Due to Global Surge Domestic Gas and Fuel Rates Remain Frozen

పాకిస్తాన్‌తో (రూ.1,046), శ్రీలంకతో (రూ.1,242), నేపాల్‌తో (రూ.1,208) పోలిస్తే భారతదేశ దేశీయ ఎల్‌పిజి ధర ప్రపంచంలోనే అత్యంత తక్కువగా ఉందని కేంద్రం తెలిపింది. అలాగే సాధారణ పెట్రోల్(petrol), డీజిల్ (diesel)ధరలు ఢిల్లీలో యథాతథంగా ఉన్నాయని, లీటరుకు రూ. 94.77, రూ. 87.67 వద్ద ఉన్నాయని కేంద్రం తెలిపింది. గత నెలలో ప్రపంచ పెట్రోలియం ధరలు 100% వరకు పెరగడంతో ఏప్రిల్ 1 నాటికి ప్రభుత్వ చమురు కంపెనీలు పెట్రోల్‌పై లీటరుకు రూ.24.40, డీజిల్‌పై లీటరుకు రూ.104.99 నష్టాన్ని భరిస్తున్నాయని తెలిపింది. తాజాగా లీటరుకు రూ.2 చొప్పున చేసిన పెంపు కేవలం ప్రీమియం పెట్రోల్ వేరియంట్‌లకు - XP95, Power95, Speedకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+