Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దీపావళికి ముందే పేలిన ఆటంబాబు: వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.266 పెంపు: ఇక కొనుక్కుని తినట్టే

న్యూఢిల్లీ: ఎవరైనా దీపావళి రోజు బాణాసంచా పేలుస్తుంటారు. లక్ష్మీబాంబులను కాలుస్తుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం మాత్రం.. దీపావళి ఇంకా నాలుగు రోజులు ఉండగానే పటాసులు పేల్చడం స్టార్ట్ చేసింది. వంటగ్యాస్ సిలిండర్ అనే బాంబు రేటు.. ధౌజండ్‌వాలా కంటే మోత మోగించింది. జనం గుండెలు అదిరేలా పేలిందీ వంటగ్యాస్ సిలిండర్ ధర.

కమర్షియల్ సిలిండర్‌పై భారీ బాదుడు..

కమర్షియల్ సిలిండర్‌పై భారీ బాదుడు..

ఊహించినట్టుగానే- ఈ నెల ఆరంభంలోనూ వంటగ్యాస్ సిలిండర్లు అమాంతంగా పెరిగాయి. ఒక్కో సిలిండర్‌ ధరను 266 రూపాయలకు పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు చమురు సంస్థలకు అనుమతిని ఇచ్చింది. ఆయిల్ కంపెనీలు పంపించిన ప్రతిపాదనలను కొద్దిసేపటి కిందటే ఆమోదించింది కేంద్ర ప్రభుత్వం. 19 కేజీల బరువు ఉండే వంటగ్యాస్ సిలిండర్లకు ఈ పెంచిన రేట్లను వర్తింపజేసింది. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే కనెక్షన్లపై మాత్రమే ఈ భారాన్ని మోపింది.

రూ.2000 దాటిన సిలిండర్ ధర..

రూ.2000 దాటిన సిలిండర్ ధర..

తాజా పెంపుతో- కమర్షియల్ వంటగ్యాస్ సిలిండర్ ధర 2,000 రూపాయలను దాటేసింది. దేశ రాజధానిలో ఆదివారం వరకూ 1,733 రూపాయలు పలికిన ఈ గ్యాస్ బండ రేటు- తాజా పెంపుతో ఆ ల్యాండ్‌మార్క్‌ను క్రాస్ చేసింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 1,683 రూపాయలు ఉన్న కమర్షియల్ వంటగ్యాస్ ధర.. ఇప్పుడు 1,950 రూపాయలకు చేరింది. కోల్‌కతలో దీని రేటు 2,073.50 పైసలుగా రికార్డయింది. చెన్నైలో అత్యధికంగా 2,133 రూపాయలుగా నమోదైంది.

డొమెస్టిక్ సిలిండర్ల రేట్లు యధాతథం..

డొమెస్టిక్ సిలిండర్ల రేట్లు యధాతథం..

గృహావసరాల కోసం వినియోగించే వంటగ్యాస్ కనెక్షన్ల జోలికి మాత్రం వెళ్లలేదు కేంద్ర ప్రభుత్వం. వాటి రేట్లల్లో ఎలాంటి మార్పూ చేయలేదు. యధాతథంగా కొనసాగిస్తోంది. 14.2 కేజీల బరువు ఉండే గృహావసర ఎల్పీజీ వంటగ్యాస్‌లో పాత రేటే కొనసాగుతోంది. డొమెస్టిక్ కేటగిరీలోని ఎల్పీజీ సిిలిండర్ ధర రూ.899.50 పైసలుగా ఉంది. కోల్‌కతలో 926 రూపాయలు, చెన్నైలో రూ.915.50 పైసలుగా ఉంటోంది. దీపావళి పండగ తరువాత.. గృహావసర ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్ల రేట్లను పెంచే అవకాశం ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి.

జనవరిలో రూ.694 నుంచి..

జనవరిలో రూ.694 నుంచి..

ఈ ఏడాది మొదట్లో 694 రూపాయలు పలికిన గృహావసర ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్ రేటు.. ఇప్పుడు 900 రూపాయల మార్క్‌ను దాటింది. దీపావళి తరువాత వెయ్యి రూపాయలను అధిగమిస్తుందనే ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. ఈ నెల 6వ తేదీన డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ల ధరలను పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే 300 రూపాయలకు పైగా గృహావసర వంటగ్యాస్ కనెక్షన్ల మీద భారం పడింది. ఇది మరింత పెరిగుతుందని, మొత్తంగా 1,000 రూపాయల మార్క్ దాటడానికి ఎంతో సమయం పట్టదని అంటున్నారు.

హోటళ్ల పరిస్థితేంటీ?

హోటళ్ల పరిస్థితేంటీ?

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో హోటళ్ల మనుగడ తలకిందులైంది. కమర్షియల్ వంటగ్యాస్‌ను వినియోగించే చిరు వ్యాపారులు ఇప్పటికే అనేక ఇక్కట్లను ఎదుర్కొన్నారు. దీనికితోడు తాజాగా వారు వినియోగించే సిలిండర్ల ధర పెరగడం అనేది- వారి వ్యాపారాన్ని మరింత దెబ్బతీయడం ఖాయంగా కనిపిస్తోంది. పెరిగిన వంటగ్యాస్ ధరకు అనుగుణంగా వారు తమ రేట్లను కూడా పెంచితే మధ్య తరగతి కుటుంబీకులు చిరుతిళ్లను కొనుక్కుని తినలేని పరిస్థితిని ఎదుర్కొంటారు. బిజినెస్ సైకిల్‌‌‌పై ఇది దుష్ప్రభావం చూపుతుందని అంటున్నారు.

Recommended Video

    Germany: Pilots Return To Work To Cover Tourism Demand
    తొలుత పెట్రోల్..డీజిల్..

    తొలుత పెట్రోల్..డీజిల్..

    తొలుత కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచింది. వాటి రేట్లను సవరించింది. లీటర్‌ ఒక్కింటికి 35 పైసల మేర పెంచేసింది. ఇంధన రేట్లను పెంచడం వరుసగా ఇది ఆరోసారి. ప్రతి రోజూ 35 పైసలు, అంతకుమించిన భారాన్ని వాహనదారులపై మోపుతున్నాయి చమురు సంస్థలు. ఏదైనా ఓ రోజు వాటి ధరలు పెంచకపోతే.. తగ్గించినట్టే భావించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెంపుదల విషయంలో ఆయిల్ కంపెనీలు ఏ మాత్రం వెనకడుగు వేయట్లేదు..మొహమాటానికి పోవట్లేదు. కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందుల పాలైన కోట్లాది కుటుంబాలపై పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదల రూపంలో వీపు విమానం మోత మోగుతోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+