Commission: మఠాలు, గుడికి నిధులు విడుదల చెయ్యడానికి కమీషన్, బాంబు పేల్చిన స్వామీజీ, డిస్కౌంట్ !

బెంగళూరు/ బళ్లారి: దక్షిణ భారతదేశంలో బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక ప్రభుత్వం తీరుతో ఆ పార్టీకి అండగా ఉంటున్న మఠాధిపతులు కొందరు ఇప్పుడు ఆ ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మా మఠాలకు ప్రభుత్వం నిధులు కేటాయించింది, ఆ నిధులు తీసుకోవాలంటే భారీ మొత్తంలో కమీషన్ (పర్సంటేజ్) ఇవ్వాల్సి వస్తోందని ప్రముఖ మఠాధిపతి బహిరంగంగా విమర్శలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. తన బిల్లలు చెల్లించడానికి 40 శాతం కమీషన్ అడిగారని ఆరోపిస్తూ ప్రముఖ కాంట్రాక్టర్, బీజేపీ నాయకుడు సంతోష్ పాటిల్ ఇటీవల మంత్రి పదవికి రాజీనామా చేసిన కేఎస్. ఈశ్వరప్ప మీద ఆరోపణలు చేస్తూ డెత్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాంట్రాక్టర్ సంతోష్ ఆత్మహత్య చేసుకున్న తరువాత కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వంలోని కొందరి మీద మఠాధిపతులు విమర్శలు చెయ్యడంతో బసవరాజ్ బొమ్మయ్ ప్రభుత్వం ఉలిక్కిపడింది. సొంత మనుషులు ఇప్పుడు ప్రభుత్వం మీద ఆరోపణలు చెయ్యడంతో వాటి నుంచి ఎలా బయటపడాలి అంటూ బీజేపీ నాయకులు ఆలోచిస్తుంటే వాటిని అస్త్రాలు చేసి ఈ ప్రభుత్వం మీద విరుచుకుపడటానికి ప్రతిపక్షాలు సిద్దం అవుతున్నాయి.

కాంట్రాక్టర్ ఆత్మహత్యతో మంత్రి పదవి గోవింద

కాంట్రాక్టర్ ఆత్మహత్యతో మంత్రి పదవి గోవింద

ఇటీవల బెళగావికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్, బీజేపీ నాయకుడు సంతోష్ పాటిల్ ఉడిపిలోని లాడ్జ్ లో డోత్ నోట్ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. తన బిల్లలు చెల్లించడానికి 40 శాతం కమీషన్ అడిగారని ఆరోపిస్తూ ప్రముఖ కాంట్రాక్టర్, బీజేపీ నాయకుడు సంతోష్ పాటిల్ సీనియర్ మంత్రి కేఎస్. ఈశ్వరప్ప మీద ఆరోపణలు చేస్తూ డెత్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాంట్రాక్టర్ సంతోష్ పాటిల్ ఆత్మహత్య వ్యవహారంతో బీజేపీ సీనియర్ నాయకుడు కేఎస్. ఈశ్వరప్ప ఆతయన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

మఠాలకు, దేవాలయాలకు భారీ నిధులు ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం

మఠాలకు, దేవాలయాలకు భారీ నిధులు ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం

దక్షిణ భారతదేశంలో బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటక ప్రభుత్వానికి మఠాధిపతులు ఎంత అండగా ఉంటున్నారో అనే విషయం కొత్తగా చెప్పనవసరం లేదు. ఇటీవల కర్ణాటకలో అధికారంలో ఉన్న బసవరాజ్ బొమ్మయ్ ప్రభుత్వం కర్ణాటకలోని 65 మఠాలకు, ప్రముఖ ఆలయాలకు రూ.119 కోట్ల నిధులు విడుదల చేసింది. మఠాలలో విద్యాసంస్థలు, ఆశ్రమాల నిర్వహణకు బసవరాజ్ బొమ్మయ్ ప్రభుత్వం రూ. 119 కోట్ల నిధులు మంజూరు చేసింది.

వ్యంగంగా సమాధానం ఇచ్చిన స్వామిజీ

వ్యంగంగా సమాధానం ఇచ్చిన స్వామిజీ

ఇప్పుడు అదే బీజేపీ ప్రభుత్వం తీరుతో ఆ పార్టీకి అండగా ఉంటున్న మఠాధిపతులు కొందరు ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విమర్శలు చెయ్యడం మొదలుపెట్టారు. మా నిధులు మేము తీసుకోవాలంటే ప్రభుత్వంలోని కొందరు పెద్దలు, అధికారులకు పర్సంటేజ్ ఇవ్వాల్సి వస్తోందని శిరపట్టి మఠం స్వామిజీ జగద్గురు ఫకీర దింగాలేశ్వర స్వామీజీ బహిరంగంగా కర్ణాటక ప్రభుత్వం మీద విమర్శలు చేశారు.

 మఠాలకు కొంచెం డిస్కోంట్ ఇచ్చాని చెప్పిన స్వామిజీ

మఠాలకు కొంచెం డిస్కోంట్ ఇచ్చాని చెప్పిన స్వామిజీ


బిల్లలు చెల్లించడానికి 40 శాతం కమీషన్ అడిగారని ఆరోపిస్తూ ప్రముఖ కాంట్రాక్టర్, బీజేపీ నాయకుడు సంతోష్ పాటిల్ సీనియర్ మంత్రి కేఎస్. ఈశ్వరప్ప మీద ఆరోపణలు చేస్తూ డెత్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే కాంట్రాక్టర్ సంతోష్ ఆరోపించినట్లు మా దగ్గర 40 శాతం కమీషన్ తీసుకోవడం లేదని, మఠాలకు 10 శాతం డిస్కోంట్ ఇచ్చి 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని శిరపట్టి మఠం స్వామిజీ జగద్గురు ఫకీర దింగాలేశ్వర స్వామీజీ వ్యంగంగా అన్నారు.

మాకే సిగ్గుగా ఉంది

మాకే సిగ్గుగా ఉంది

30 శాతం కమీషన్ ఇవ్వకుంటే మీ మఠాలకు, దేవాలయాలకు ప్రభుత్వ నిధులు విడుదల చెయ్యమని కొందరు అధికారులు ముఖం మీద చెబుతున్నారని, ఇలాంటి ప్రభుత్వం ఉండటం నిజంగా సిగ్గుచేటు అంటూ కొందరు స్వామీజీలు మండిపడుతున్నారు.మా మఠాలకు ప్రభుత్వం నిధులు కేటాయించింది, ఆ నిధులు తీసుకోవాలంటే భారీ మొత్తంలో కమీషన్ (పర్సంటేజ్) ఇవ్వాల్సి వస్తోందని ప్రముఖ మఠాధిపతి బహిరంగంగా కర్ణాటకోని బీజేపీ ప్రభుత్వం మీద విమర్శలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

 బొమ్మయ్ ప్రభుత్వానికి షాక్

బొమ్మయ్ ప్రభుత్వానికి షాక్


కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వంలోని కొందరి మీద మఠాధిపతులు విమర్శలు చెయ్యడంతో బసవరాజ్ బొమ్మయ్ ప్రభుత్వం ఉలిక్కిపడింది. సొంత మనుషులు ఇప్పుడు ప్రభుత్వం మీద ఆరోపణలు చెయ్యడంతో వాటి నుంచి ఎలా బయటపడాలి అంటూ బీజేపీ నాయకులు ఆలోచిస్తుంటే వాటిని అస్త్రాలు చేసి ఈ ప్రభుత్వం మీద విరుచుకుపడటానికి ప్రతిపక్షాలు సిద్దం అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+