• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అవిశ్వాసానికి ముందు: మోడీని సామాన్యుడు అడగాలనుకుంటున్న ప్రశ్నలివే..!

|

శుక్రవారం ఎన్డీయే సర్కార్ అవిశ్వాస తీర్మానం ఎదుర్కోనుంది. అంతకంటే ముందు మోడీ పలు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంది. అయితే మీకే గనుక ప్రధానిని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటే ఎలాంటి ప్రశ్నలను మీరు సంధిస్తారు..? అని సామాన్య ప్రజలను అడిగితే వారు అడిగాలనుకున్న పది ప్రశ్నలు ఇలా ఉన్నాయి...

  మోడీ ప్రభుత్వానికి నష్టం లేదు: టీడీపీ

  సామాన్యులు ప్రధానిని అడగాలనుకుంటున్న మొదటి ప్రశ్న దేశంలో పుకార్ల వల్ల జరుగుతున్న హత్యలు.
  " ఈ మధ్యకాలంలో మీరు చెబుతున్న మాట గోసంరక్షణ పేరుతో మనుషులను చంపడం సహించరాని నేరంగా పరిగణిస్తామని. బీజేపీ ప్రభుత్వానిది అభివృద్ధి అనే సింగిల్ అజెండా అని చెబుతున్నారు. కానీ కొన్ని వారాల క్రితమే మీ కేంద్రమంత్రి జయంత్ సిన్హా హత్య చేసిన నిందితులను పూలదండలతో సన్మానించారు.

  ఎంపీ నిషికాంత్ దూబే నిందితులకు న్యాయపరంగా అయ్యే ఖర్చును భరిస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు స్వామి అగ్నివేష్‌పై మీ పార్టీ యువకార్యకర్తలు దాడి చేశారు " మీ పార్టీకి చెందిన మంత్రులు నేతలు, కార్యకర్తలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు..? అనేది సామాన్యులు అడగాలనుకుంటున్న మొదటి ప్రశ్న

  భార్యపై భర్త అత్యాచారం చేయడం సమర్థిస్తారా..?

  భార్యపై భర్త అత్యాచారం చేయడం సమర్థిస్తారా..?

  వివాహం తర్వాత భార్యకు ఇష్టంలేకున్నా భర్త అత్యాచారం చేస్తే దాన్ని భారతీయ సంస్కృతి విలువలతో ఎందుకు ముడిపెడుతున్నారు..? అంతేకాదు ఢిల్లీ హైకోర్టులో కూడా వివాహం అనంతరం భర్త భార్యపై అత్యాచారం చేయడం నేరం కాదన్నట్లుగా ప్రభుత్వం వాదిస్తోంది... ఎందుకు..?

  అన్నిటికీ ఆధార్ లింక్ చేయడమెందుకు

  అన్నిటికీ ఆధార్ లింక్ చేయడమెందుకు

  ప్రైవేట్ సర్వీసులైన బ్యాంక్ అకౌంట్లకు, మొబైల్ ఫోన్లకు ఆధార్ ఎందుకు తప్పనిసరి చేస్తోంది. ఇతర డాక్యుమెంట్లు, గుర్తింపు కార్డులుండగా కేవైసీ కోసం ఆధార్‌ కార్డునే ఎందుకు తప్పని సరి చేస్తోంది...? సుప్రీం కోర్టు కూడా ఆధార్‌ను తప్పనిసరిచేస్తూ ఆదేశాలు ఇచ్చిందని మీ ప్రభుత్వం ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తోంది..?

  తప్పుడు సమాచారం ఎందుకు...నోరు జారారా..?

  తప్పుడు సమాచారం ఎందుకు...నోరు జారారా..?

  మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీలు పాకిస్తాన్‌తో చర్చలు జరిపారని అవి గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఓటమికోసమే వారు పాక్ నేతలను కలిశారని మీ పార్టీ నేతలు ఎందుకు ప్రచారం చేశారు..? మీరు ఆరోపణలు నిజమైతే మరెందుకు విచారణ చేయించలేదు..?అది కూడా పాకిస్తాన్ గుజరాత్ ఎన్నికల్లో జోక్యం చేసుకుంటోందంటే విచారణ ఎందుకు చేయించలేదు.. అంటే మీ ఆరోపణల్లో వాస్తవం లేదా..? లేక నోరు జారారా..?

  ఎన్నికల విరాళాలు

  ఎన్నికల విరాళాలు

  రాజకీయ పార్టీలకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పక్కర్లేదంటూ చట్టసవరణ చేశారు.. ఇది న్యాయమేనా..? రాజకీయ పార్టీలకు విరాళాలు ఇంటినుంచి కానీ, విదేశాల నుంచి ఎలక్టరోల్ బాండ్స్ రూపంలో వస్తే ఆ లెక్కలు ఎందుకు చెప్పకూడదు..? అలాంటప్పుడు పారదర్శకత ఎక్కడ కనిపిస్తుంది..? విరాళాలు బాండ్ల రూపంలో అనేదానిపై సర్వత్రా విమర్శలు వస్తున్నా మీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు...?

  నీరవ్ మోడీ ఎలా బురిడీ కొట్టించగలిగాడు..?

  నీరవ్ మోడీ ఎలా బురిడీ కొట్టించగలిగాడు..?

  పంజాబ్ నేషనల్ బ్యాంకును వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ ఎలా బురిడీ కొట్టించగలిగాడు..?

  ఆర్థిక సంస్థలకు తెలియకుండా చేశాడంటే ఇందులో పెద్దల పాత్ర ఏమైనా ఉందా...? అంతేకాదు 10వేల కోట్లకు పైగా టోపీ పెట్టి దేశాన్ని అంత ధైర్యంగా ఎలా దాటగలిగారు..? మీ ప్రభుత్వంలో ఇది అతిపెద్ద వైఫల్యమా కాదా...?

  నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్

  నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్

  లిస్టెడ్ బ్యాంకులకు సంబంధించి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఒక్క ఏడిదిలోనే 44శాతానికి పెరిగాయి. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో అయితే ఇది దాదాపు 90శాతానికి చేరుకుంది. NPAలపై మీ ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించలేకపోయింది..?

   ఉద్యోగాల హామీ

  ఉద్యోగాల హామీ

  2014 ఎన్నికల ప్రచార సమయంలో ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ 2016-17 ఆర్థిక సర్వే మాత్రం ఉద్యోగాల కల్పన విపరీతంగా పడిపోయందని పేర్కొంది. ఇప్పటికే మీ ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లు అయ్యింది. ఇప్పటి వరకు ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో సరైన సమాచారం లేదు... ఇదే సాకుగా చూపించి కాలయాపన చేయాలనుకుంటున్నారా...?

   డీమోనటైజేషన్

  డీమోనటైజేషన్

  పెద్దనోట్ల రద్దుతో నల్లధనం వెలికితీస్తామని పదే పదే మీరు చెప్పారు. అయితే 99శాతం రద్దయిన పెద్దనోట్లు బ్యాంకుకు చేరుకున్నాయని ఆర్బీఐ ప్రకటించింది. మరి నల్ల ధనం ఉన్న బడాబాబులపై మీరన్నట్లుగా ఎలాంటి ప్రభావం చూపింది...? పెద్ద నోట్లు రద్దు అయి కూడా 20 నెలల సమయం కావొస్తోంది. నల్లధనం ఉన్న బడాబాబుల విషయంలో మీరెలాంటి చర్యలు తీసుకుంటున్నారు..?

  వివాదాస్పద వ్యక్తులతో మోడీకి సంబంధాలు

  వివాదాస్పద వ్యక్తులతో మోడీకి సంబంధాలు

  ఫిబ్రవరి 2017లో రాజ్యసభలో టీఎంసీ ఎంపీ ఒక విషయాన్ని సభకు తెలిపారు. ట్విటర్ అకౌంట్ల ద్వారా అత్యాచార బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తులు,మతకల్లోలాకు పాల్పడుతున్న వ్యక్తుల అకౌంట్లను ప్రధాని మోడీ ఫాలో అవుతున్నారని చెప్పారు. దీనిపై ప్రధాని ఎందుకు నోరుమెదపరు..?

  ఇలా పది ప్రశ్నలకు ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని సామాన్యులు డిమాండ్ చేస్తున్నారు.అయితే ఇదే విషయాలను ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తే ప్రభుత్వం సమాధానం చెప్పకుండా దాటవేసే ధోరణిని అవలంబిస్తోందని సామాన్యులు ధ్వజమెత్తుతన్నారు.

  English summary
  On Friday evening, Prime Minister Narendra Modi will answer the Opposition’s questions in Parliament as he culminates the debate before the no-confidence vote his government faces. But what question would you ask the prime minister if you got the chance?
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X