వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రమంత్రి కోసం విమానం నుండి దింపారు, వివరణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి కిరణ్ రిజిజు వివాదంలో చిక్కుకున్నారు. లెహ్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని మంత్రి కోసం ఆలస్యం చేశారు. అంతేకాదు, ముగ్గురు ప్రయాణీకులను దించేశారు. ఈ సంఘటన జూన్ 24న జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కిరణ్ కోసం విమానంలో ఎక్కి కూర్చున్న ఒక చిన్నారితో పాటు ముగ్గురిని ఎయిర్ ఇండియా దించేసింది.
ఈ నెల 24వ తేదీన కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఆయన సహాయకురాలు కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు లెహ్ వెళ్లారు.

అక్కడ నుంచి తిరుగు ప్రయాణంలో ప్రత్యేక హెలికాప్టర్‌లో రావాల్సి ఉంది. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో లెహ్ నుంచి ఢిల్లీకి విమానంలో వచ్చేందుకు విమానాశ్రయానికి వచ్చారు.

'Communication gap': Kiren Rijiju after reports he delayed AI flight

దీంతో, కేంద్రమంత్రి కోసం అప్పటికే విమానంలో కూర్చొన్న ముగ్గురు ప్రయాణికులను కిందికి దించేసి, కేంద్రమంత్రికి, ఆయన సహాయకులకు సీటు కేటాయించారు. ఇది విమర్శలకు దారి తీసింది. కిరణ్ కోసం విమానాన్ని గంటకు పైగా నిలిపేశారని ఇతర ప్రయాణికులు కూడా ఆరోపిస్తున్నారు.

ఈ వివాదంపై కిరణ్ రిజిజు స్పందించారు. తాము విమానాశ్రయానికి వెళ్లేసరికి విమానం డోర్లు మూసివేశారని, 11:40 గంటలకు బయలుదేరాల్సిన విమానం 10:20కే బయలుదేరడం ఏమిటని ప్రశ్నించారు. తమను కొద్దిసేపటి తర్వాతే విమానంలోకి వెళ్లనిచ్చారన్నారు. ముగ్గురిని కిందకు దించారన్న దాని గురించి తనకు తెలియదన్నారు. అలా చేస్తే అది తప్పే అవుతుందన్నారు.

English summary
Three passengers, including a child, were allegedly offloaded from an Air India aircraft on June 24 to accommodate minister of state for home affairs Kiren Rijiju and his aide, triggering a blizzard of criticism from civil society and opposition parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X