వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో కరోనా సామూహిక వ్యాప్తి...? ఆరోగ్యశాఖ మంత్రి ఆందోళన, కానీ.. ఐసీఎంఆర్ అని..

|
Google Oneindia TeluguNews

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నగరంలో కమ్యూనిటీ స్ప్రెడ్ జరుగుతోందా అని అనుమానం వ్యక్తం చేశారు. కానీ దీనిని కేంద్ర ప్రభుత్వం/ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ప్రకటించాల్సి ఉంది అని పేర్కొన్నారు.

ఢిల్లీ లాంటి మహానగరంలో జన సమూహం అధికంగానే ఉంటారు. అయితే ఈ విషయాన్ని ఐసీఎంఆర్ ధృవీకరించాల్సి ఉంటుంది. అయితే గత 40 రోజుల్లో కరోనా వైరస్ కేసుల శాతం రెట్టింపు అవడంతో సత్యేంద్ర జైన్ అనుమానం వ్యక్తం చేశారు. ఢిల్లీలో శుక్రవారం 4 వేల 127 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 38 వేలకు చేరింది. అలాగే మృతుల సంఖ్య కూడా 4 వేల 907కి చేరింది.

Community spread of coronavirus in Delhi, Centre shouldve admitted..

మరోవైపు బుధవారం అత్యధికంగా 4 వేల 473 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వచ్చాయి. ఆ రోజు వైరస్ సోకి 33 మంి చనిపోయారు. అంతకుముందు ఈ నెల 12వ తేదీన 4 వేల 321 వైరస్ కేసులు అత్యధిక రికార్డు ఉంది. కరోనా వైరస్ కేసులు పెరగడంతో కంటోన్మైంట్ జోన్ల సంఖ్యను కూడా పెంచుతున్నారు. 1670 ఉన్న కంటోన్మైంట్ జోన్లను 1751కి పెంచారు. అలాగే పాజిటివ్ కేసుల సంఖ్య 6.76 నుంచి 7.38కి పెరిగింది. అలాగే వైరస్ వచ్చి తగ్గినవారి సంఖ్య కూడా 84.44కి చేరింది. అయితే మృతుల సంఖ్య 2.05 శాతానికి చేరింది.

English summary
Delhi continues to report a spike in its daily coronavirus cases, Delhi Health Minister Satyendra Jain said on Saturday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X