చర్యలు తీసుకోండి: సచిన్ గిర్ పర్యటనపై ఈసికి ఫిర్యాదు
న్యూఢిల్లీ: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ గిర్ అభయారణ్య పర్యటన పైన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. గత నెల మార్చి 22న సచిన్ టెండుల్కర్ గిర్ అభయారణ్య పర్యటనకు వచ్చినప్పుడు ఫారెస్ట్ అధికారులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని ఫిర్యాదు చేశారు.
జునాగఢ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ కార్యకర్తల అసోసియేషన్ ఈ ఫిర్యాదు చేసింది. గత నెలలో సచిన్ గిర్ అభయారణ్య పర్యటన సమయంలో ఉల్లంఘనకు పాల్పడ్డ అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు ఎన్నికల సంఘాన్ని కోరారు.

మార్చి 22న సచిన్, ఆయన కుటుంబ సభ్యులు గిర్ అభయారణ్యానికి వచ్చినప్పుడు ఫారెస్టు అధికారులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని సదరు కార్యకర్తల అసోసియేషన్ చెబుతోంది. అందుకే తాము ఫిర్యాదు చేశామన్నారు.
వారు ప్రభుత్వ వాహనాలను ఉపయోగించారని, అంతేకాకుండా గిర్ పులుల సంరక్షణ కేంద్రంలో నిర్దిష్ట సమయం కంటే వారు ఎక్కువ సేపు ఉన్నారని వారు ఆరోపిస్తున్నారు.
కాగా, తమకు ఫిర్యాదు అందిందని అయితే, సచిన్‌తో కలిసి ఉన్న ఫారెస్టు అధికారులకు ఎలాంటి పోలింగ్ డ్యూటీ ఇవ్వలేదని జునాగఢ్ జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి అలోక్ కుమార్ పాండే చెప్పారు.












Click it and Unblock the Notifications