టర్కీ భూకంపాల వేళ భారత్‌లో ఆందోళన: అక్కడ భారీ భూకంపం వచ్చే ఛాన్స్!!
టర్కీ భూకంపాల వేళ భారత్‌లో ఆందోళన కనిపిస్తుంది. వచ్చే పదేళ్ళలోభారతదేశంలో ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో భారీ భూకంపం వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు చెప్తున్నారు.
టర్కీలో వరుసగా చోటు చేసుకున్న అనేక భూకంపాలు మరణ మృదంగాన్ని మోగిస్తున్నాయి. రిక్టర్ స్కేలు పై 7.6 గా నమోదవుతు అనేకమార్లు చోటుచేసుకుంటున్న భూకంపాలు ఇప్పటివరకు టర్కీలో ఎనిమిది వేల మందిని ప్రాణాలను హరించాయి. ఈ ఘోర విపత్తులో దాదాపు 20,000 మంది దాకా మృతి చెంది ఉంటారు అంటూ అంచనా వేస్తున్నారు. ఇక టర్కీలో సంభవించిన ఘోర భూకంపాల నేపథ్యంలో టర్కీ, సిరియాలకు సహాయం అందించడం కోసం భారతదేశంలో పాటు 45 దేశాలు ముందుకు వచ్చాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక టర్కీలో కొనసాగిన ప్రకృతి ప్రకోపం వేళ భారతదేశంలోనూ భూకంపాలపై ఆందోళన కొనసాగుతుంది.

టర్కీ భూకంపాల వేళ భారత్ లోనూ భూకంప భయం
టర్కీ భూకంపాలను చూసిన భారతదేశ ప్రజలు.. ఇండియాలో కూడా ఇటువంటి ప్రకృతి విపత్తు వస్తే పరిస్థితి ఏమిటి అని ఆలోచనలో పడ్డారు. భారతదేశంలోనూ భూకంపాలు వచ్చే ప్రమాదం లేకపోలేదని ఇప్పటికే నిపుణులు చెబుతున్నారు. భారత భూభాగం లోపల భారీ పీడనం గత 50 సంవత్సరాలుగా గూడు కట్టుకుందని, అది బయటకు రావడానికి ప్రయత్నిస్తోందని, ఏ సమయంలోనైనా అది బయటకు వచ్చే అవకాశం ఉందని నిపుణులు ఇప్పటికే హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే టర్కీ భూకంపాల ప్రభావం భారతదేశంలోని ప్రజల మనసులలో మనదేశంలో భూకంపం వస్తే ఎలా? అన్న ఆందోళనకు కారణంగా మారింది.

ఉత్తర భారతదేశం డేంజర్ జోన్ లో
అయితే భారతదేశం విషయానికి వస్తే దక్షిణ భారతదేశం సురక్షితం కానీ ఉత్తర భారతదేశం సురక్షితంగా లేదని భూగర్భ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకు వారు అనేక కారణాలను సైతం చెబుతున్నారు. భూమి లోపల పొరల్లో జరిగే మార్పుల కారణంగా, భూమి లోపల పీడనం ఏర్పడి, అది భూకంపాల రూపంలో బయటకు పోతుంది. భూగర్భ శాస్త్ర నిపుణులు చెబుతున్న లెక్కల ప్రకారం ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలోనూ ప్రతి పదేళ్లకు ఒకసారి కచ్చితంగా భూ ప్రకంపనలు చోటు చేసుకుంటాయి.

హిమాలయాల పరిసర ప్రాంతాల్లో భూకంపాల ఛాన్స్
మనదేశంలోని హిమాలయాలలో గత 50 ఏళ్లుగా భారీ భూకంపం ఏది రాలేదు. వచ్చే అవకాశం లేకపోలేదు. భూమి లోపల కదలికలు జరగడం సర్వసాధారణం కాబట్టి, భూమి లోపల ఫలకాల కదలికల వల్ల కలిగే పీడనం బయటకు వెళ్లడానికి వచ్చే పదేళ్లలో ఎప్పుడైనా భూ ప్రకంపనలు చోటుచేసుకునే అవకాశం ఉందని ఎన్జీఆర్ఐ లోని భూకంప పరిశోధన కేంద్రం చీఫ్ సైంటిస్ట్ వెల్లడించారు. ఇప్పటికే ఉత్తరాఖండ్లోని జోషి మఠ్ కుంగిపోతున్న వార్తలు మనకు తెలిసిందే.. ఇక అక్కడ భూకంపం సంభవించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

వచ్చే పదేళ్ళలో భూకంపానికి అవకాశం
గతంలో 1897, 1905, 1934, 1950 లలో హిమాలయాలు చుట్టుపక్కల తీవ్రమైన భూకంపాలు వచ్చాయి. ఇక ఆ తర్వాత ఇప్పటివరకు సంభవించిన పెద్ద భూకంపం ఏది లేదు. ఈ క్రమంలో భవిష్యత్తులో అవకాశం ఉందని, ఉత్తర భారతదేశం డేంజర్ జోన్ లో ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా హిమాలయాల పరిసర ప్రాంతాలలో భూకంపం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

టర్కీలోలా భారీ భూకంపం వస్తే ఇండియాలో పరిస్థితి ఇలా .. ఆందోళన
భూకంపం వచ్చే అవకాశాన్ని, ప్రమాదాన్ని గుర్తించినప్పటికీ, భూకంపం వస్తే తట్టుకునే లాగా భారతదేశంలోని నిర్మాణాలు ఏవీ లేవు. ఈ క్రమంలో టర్కీ తరహాలో భారతదేశంలో భారీ భూకంపం వస్తే భయంకరమైన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా టర్కీలో ప్రకృతి ప్రళయం సృష్టిస్తున్న వేళ.. భారత్లోనూ ప్రళయ సంకేతాలు కనిపిస్తూ ఉండడం ఆందోళన కలిగిస్తుంది.
-
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ












Click it and Unblock the Notifications