వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక గవర్నర్ మరో వివాదాస్పద నిర్ణయం: మళ్లీ సుప్రీంకు కాంగ్రెస్, జేడీఎస్!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కర్ణాటక గవర్నర్ తీసుకున్న మరో నిర్ణయం కూడా వివాదాస్పదమవుతోంది. సీఎం యడ్యూరప్ప బలనిరూపణ ఇంకా పూర్తి కాకుండానే ఓ ఆంగ్లో ఇండియన్ ను ఆయన అసెంబ్లీకి నామినేట్ చేయడం దీంతో అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 225కి పెరిగింది.

ఈ నేపథ్యంలో గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌-జేడీఎస్‌లు మరోసారి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. యడ్యూరప్ప ఇంకా బలాన్ని నిరూపించుకోకముందే గవర్నర్ ఎమ్మెల్యేను నామినేట్ చేయడం రాజ్యాంగ విరుద్దమని ఆ పార్టీలు వాదిస్తున్నాయి. కాబట్టి బలనిరూపణ పూర్తయ్యేదాకా ఆ పిటిషన్ చెల్లుబాటు కాకుండా ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టును కోరాయి.

Cong JDS move SC against nomination of Anglo-Indian MLA in Karnataka Assembly

శుక్రవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. గురువారం తెల్లవారుజామున యడ్యూరప్ప ప్రమాణస్వీకారంపై దాఖలైన పిటిషన్ తో పాటే శుక్రవారం దీనిపై విచారణ జరిగే అవకాశం ఉంది. కాగా, యడ్యూరప్ప ప్రమాణస్వీకారాన్ని ఆపాలంటూ అర్థరాత్రి కాంగ్రెస్, జేడీఎస్ లు సుప్రీంకోర్టును ఆశ్రయించడం.. సుప్రీం బీజేపీకి అనుకూలంగా తీర్పునివ్వడం తెలిసిందే.

కర్ణాటక అడ్వకేట్ జనరల్ మార్పు:

కర్ణాటక ప్రస్తుత అడ్వకేట్ జనరల్ మధుసూదన్ ఆర్ నాయక్ స్థానంలో కొత్తగా ప్రభులింగ్ కె నవాడ్గిని నియమించారు కర్ణాటక గవర్నర్ వజుభాయ్ వాలా. ప్రమాణస్వీకారం చేసిన వెంటనే సీఎం యడ్యూరప్ప నలుగురు ఐపీఎస్ లను బదిలీ చేయగా.. తాజాగా గవర్నర్ ఏజీని మార్చడం గమనార్హం.

English summary
The Congress-JD(S) combine on Thursday moved the Supreme Court against the decision of Karnataka Governor Vajubhai Vala to nominate an Anglo-Indian member to the Assembly, saying it should not be done till the floor test in the House.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X