300 సీట్లు మావే, రాష్ట్రంలోను అద్భుతం: వెంకయ్య

బిజెపి ప్రచారం ఊపందుకుందని, ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన మోడీ నవ భార త యువ భేరీ సభను ఆదర్శంగా తీసుకుని దేశ వ్యాప్తంగా సభలు, సమ్మేళనాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం ఎక్కడ చూసినా మోడీ ప్రభంజనం వీస్తోందన్నారు. ఇటీవల హర్యానాలో జరిగిన మాజీ సైనికుల సభకు లక్షన్నరకుపైగా మాజీ సైనికులు తరలిరావడమే బిజెపికి పెరుగుతోన్న ఆదరణకు నిదర్శనమన్నారు.
అభివృద్ధే ఎజెండాగా ప్రజల్లోకి వెళుతోన్న తమ పార్టీ 300 పైచిలుకు లోక్‌సభ సీట్లను గెలుచుకుంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ అద్భుత పరిణామాలు వస్తాయన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పదేళ్ల కాలంలో ప్రజలు నిరాశ నిస్పృహలతో ఉన్నారని, అంతకుముందు అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో అభివృద్ధి ఫలాలను చవిచూసిన ప్రజలు కాంగ్రెస్ పాలన చూశాక తీవ్ర నిర్వేదంలోకి వెళ్లిపోయారన్నారు.
ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు మోడీ ప్రధాని అయితే ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమంటూ ప్రచారం సాగిస్తున్నారని, నిజానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న గొప్ప ప్రధాన అభ్యర్థి ఎవరంటే మోడీయే అన్నారు. తాము ముందుగానే ప్రధాని అభ్యర్థిని ప్రకటించామని, కాంగ్రెసు ఇది వరకు నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ అనేవారని, ఇప్పుడు మీ ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పలేని దుస్థితిలో ఉన్నారన్నారు.












Click it and Unblock the Notifications