వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అద్వానీ, జోషి ఆదర్శనీయం : టికెట్ ఇష్యూపై గడ్కరీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : అద్వానీ, జోషికు టికెట్ ఇవ్వక అవమానించడంతో విపక్షాలు విమర్శలు చేయడంతో .. బీజేపీ కౌంటర్ అటాక్ చేస్తోంది. బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేశాక అమిత్ షా స్వయంగా వెళ్లి అద్వానీ, జోషిని కలిశారు. ఆ తర్వాత కేంద్రమంత్రి, సీనియర్ నేత నితిన్ గడ్కరీ కూడా స్పందించారు. కాంగ్రెస్ నేతల ఆరోపణలను తోసిపుచ్చారు.

congress allegations are fake : gadkari

ఎందుకంటే .. కారణమిదీ ?
ఏ సంస్థలోనైనా నిర్షీత సమయం తర్వాత ఉద్యోగ విరమణ తప్పనిసరి .. రాజకీయాల్లో కూడా ఆ నిబంధనను బీజేపీ తీసుకొచ్చిందని చెప్పారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం మేరకు ఎన్నికల్లో 75 ఏళ్ల వయస్సు వరకు టికెట్లు ఇస్తామని స్పష్టంచేశారు. ఈ క్రమంలోని అద్వానీ, జోషి లాంటి వ్యక్తులకు టికెట్లు ఇవ్వలేకపోయామని చెప్పారు.

అయినా గౌరవిస్తాం
వారికి తగిన గుర్తింపు, గౌరవం లభిస్తోందని చెప్పారు. పార్ట నేతలు, కార్యకర్తలకు వారు ఆదర్శమని, మార్గదర్శకులని పేర్కొన్నారు. ఇటీవల బ్లాగులో అద్వానీ రాసిన అంశాలు పార్టీ సిద్ధాంతాలను గుర్తుచేయడమేనని కవర్ చేశారు. అద్వానీ అభిప్రాయంతో పార్టీ నేతలంతా ఏకీభవిస్తున్నారని పేర్కొన్నారు. కానీ కొందరు తప్పుగా అర్థం చేసుకొని లేని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.

న్యాయ్‌తో అన్యాయమే ?
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కనీస ఆదాయ పథకాన్ని విమర్శించారు గడ్కరీ. ఓట్ల కోసమే కాంగ్రెస్ ఇలాంటి పథకాలను ప్రవేశపెడుతోందని ధ్వజమెత్తారు. ఈ పథకం కోసం అంత భారీస్థాయిలో నిధులు ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు. న్యాయ్ పథకం అమలుచేస్తే వ్యవసాయ సహా కీలకరంగాలకు నిధులు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు.

English summary
Advani and Joshi have been given a ticket because the Opposition has criticized .. then BJP counter attack. After the BJP manifesto was released, Amit Shah himself went and met Advani and Joshi. Union Minister and senior leader Nitin Gadkari also responded. Congress leaders rejected the allegations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X