Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై కరోనా ఎఫెక్ట్: కరోనా కారణంగా కాంగ్రెస్ అభ్యర్థి మృతి

దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది . విపరీతంగా పెరుగుతున్న కేసులతో దేశంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే సమయం లో కరోనా మహమ్మారి బారిన పలువురు ప్రముఖులు సైతం పడుతున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కరోనా బారిన పడి మృతి చెందారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో విషాదం నెలకొంది.

సంషర్‌గంజ్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి మృతి

సంషర్‌గంజ్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి మృతి

సంషర్‌గంజ్ నియోజకవర్గం నుంచి 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రెజౌల్ హక్ కోవిడ్ -19 మహమ్మారి కారణంగా మరణించినట్లు గురువారం నివేదికలు తెలిపాయి.కరోనావైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన తరువాత ఆయన కోల్‌కతాలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన ఆరోగ్యం విషమించటంతో మరణించారు . మరణించిన కాంగ్రెస్ అభ్యర్థి ముర్షిదాబాద్‌లోని సంషర్‌గంజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కార్యదర్శి రోహన్ మిత్రా ట్వీట్

బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కార్యదర్శి రోహన్ మిత్రా ట్వీట్

గురువారం ఉదయం బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కార్యదర్శి రోహన్ మిత్రా ట్విట్టర్‌లో ఈ విషయం తెలిపారు . ఆయన ఇలా వ్రాశారు, "ముర్షిదాబాద్ జిల్లాలో, సామ్‌సర్గంజ్ అసెంబ్లీ ఐఎన్‌సి ఇండియా అభ్యర్థి రెజౌల్ హక్ కరోనా కారణంగా గత రాత్రి కన్నుమూశారు . బెంగాలీ క్యాలెండర్ యొక్క తరువాతి కొత్త సంవత్సరాన్ని చూడటానికి ఈ సంవత్సరం జీవించి ఉండండి అంటూ పలువురు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. కానీ ఆయన మరణించారు.

మొహమ్మద్ రెజౌల్ హక్‌ను అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్

మొహమ్మద్ రెజౌల్ హక్‌ను అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్

సంషర్‌గంజ్ సీటు నుంచి ఇరు పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో ఇటీవల లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ మధ్య ముఖాముఖి జరిగింది. లెఫ్ట్ ఫ్రంట్ మోడసార్ హుస్సేన్‌ను సంషర్‌గంజ్ సీటు నుంచి తన అభ్యర్థిగా ప్రకటించగా, కాంగ్రెస్ అక్కడి నుంచి మొహమ్మద్ రెజౌల్ హక్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఏప్రిల్ 17 న జరగనున్న ఐదవ దశ ఎన్నికల పోలింగ్ లో 45 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ఐదవ ప్రచారం బుధవారం ముగిసింది.

Recommended Video

    Top News Of The Day | Oneindia telugu
    ఎల్లుండి ఐదో దశ పోలింగ్ .. కరోనా ఎఫెక్ట్ తో దారుణ పరిస్థితి

    ఎల్లుండి ఐదో దశ పోలింగ్ .. కరోనా ఎఫెక్ట్ తో దారుణ పరిస్థితి

    నాలుగో దశలో కూచ్ బెహార్ హత్యలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం ఎన్నికల ప్రచారం తర్వాత శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలింగ్ కు ఎన్నికల ప్రచారానికి మధ్య సమయాన్ని 48 నుండి 72 గంటలకు పెంచింది. ఇక ఈ దశ పోలింగ్లో సిలిగురి మేయర్, లెఫ్ట్ ఫ్రంట్ నాయకుడు అశోక్ భట్టాచార్య, రాష్ట్ర మంత్రి బ్రాత్య బసు, బిజెపికి చెందిన సామిక్ భట్టాచార్య సహా 342 మంది అభ్యర్థుల విధిని నిర్ణయించడానికి మొత్తం 1.13 కోట్ల మంది ఓటర్లు ఓటు వేసేందుకు రెడీ అవుతున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+