మోడీకి చెక్: బీజేపీకి అధికారం వద్దు, 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ పొత్తు, పోటీ!
బెంగళూరు: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా చెయ్యడానికి జేడీఎస్-కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని 2019లో కలిసి పోటీ చెయ్యాలని నిర్ణయించామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జి. పరమేశ్వర్ అన్నారు. అయితే లోక్ సభ నియోజక వర్గాల కేటాయింపు విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర్ అన్నారు.

జేడీఎస్ తో చర్చలు
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జి. పరమేశ్వర్ శనివారం మీడియాతో మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్-జేడీఎస్ కలిసిపోటీ చెయ్యాలని ఇప్పటికే చర్చలు జరిపి నిర్ణయం తీసుకున్నామని ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జి. పరమేశ్వర్ స్పష్టం చేశారు.

ఎవరికి ఎన్ని సీట్లు
లోక్ సభ నియోజక వర్గాల పంపిణి విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఇంకా సమయం ఉందికదా అని ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జి. పరమేశ్వర్ చెప్పారు. సీట్ల పంపిణి విషయంపై సీఎం కుమారస్వామి, తాను చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జి. పరమేశ్వర్ అన్నారు.

ఎవరి బలం ఎంత!
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకూడదనే ప్రధాన లక్షంగా జేడీఎస్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోందని డాక్టర్. జి. పరమేశ్వర్ వివరణ ఇచ్చారు. ఏ లోక్ సభ నియోజక వర్గంలో ఏ పార్టీకి ఎంత బలం ఉంది అని ఒక అంచనా వేసిన తరువాత సీట్ల పంపకంపై చర్చలు జరుగుతాయని డాక్టర్ జి. పరమేశ్వర్ చెప్పారు.

టార్గెట్ బీజేపీ
కర్ణాటకలోని అన్ని లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్-జేడీఎస్ కలిసి పోటీ చేసి ఎక్కువ సీట్లు కైవసం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటుందని, అందులో ఎలాంటి సందేహం లేదని ఉప ముఖ్యమంత్రి డాక్టర్ జి. పరమేశ్వర్ ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications