'జేడీఎస్-కాంగ్రెస్ మధ్య కుదిరిన డీల్ ఇదీ, ఆ విషయాలు బయటపెట్టకూడదు'
బెంగళూరు: అసెంబ్లీలో బలనిరూపణకు తమకు ఏడుగురు ఎమ్మెల్యేలు మాత్రమే తక్కువగా ఉన్నారని కేంద్రమంత్రి, బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్ అన్నారు. యడ్యూరప్ప గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని బీజేపీ ఓడించిందనే విషయం రాహుల్ గాంధీ గుర్తించాలన్నారు.
కాంగ్రెస్ పార్టీకి 78 వస్తే మాకు 104 వచ్చాయన్నారు. స్వయంగా సిద్ధరామయ్య ఓచోట ఓడిపోయి, మరోచోట బొటాబోటి మెజార్టీతో గెలిచారన్నారు. నకిలీ ఓటరు కార్డులు, తప్పుడు ఆరోపణలతో కాంగ్రెస్, జేడీఎస్ మోసగించాయని చెప్పారు. కాంగ్రెస్ - జేడీఎస్ మధ్య రహస్య ఒప్పందం ఉందని జవదేకర్ సంచలన ఆరోపణలు చేశారు.

అవినీతి ఆరోపణలు తిరగదోడకుండా ఆ రెండు పార్టీలు డీల్ కుదుర్చుకున్నాయని ఆరోపించారు. వారి మధ్య ఉన్న అసలు డీల్ ఇదే అన్నారు. కాంగ్రెస్ అవినీతిని బయటపెట్టకూడదని జేడీఎస్‌కు ముఖ్యమంత్రి పదవి అన్నారు.
పార్లమెంటును అపహాస్యం చేసింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రెస్ సెన్సార్‌షిప్ తీసుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. కాంగ్రెస్ హయాంలో కోల్ స్కాం, 2జీ ఇలా ఎన్నో కుంభకోణాలు చోటు చేసుకున్నాయన్నారు. మోడీ వ్యవస్థలను దెబ్బతీస్తున్నారన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై మండిపడ్డారు. వ్యవస్థలను గౌరవించంది కాంగ్రెస్ పార్టీయే అన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications