వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రికెట్ తర్వాత: సచిన్‌పై కాంగ్రెస్ కన్ను, ఒప్పించేందుకు..

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ పైన కాంగ్రెసు పార్టీ దృష్టి సారించిందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. త్వరలో సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయాల్లోకి దించడంపై కాంగ్రెసు దృష్టి సారించిందని అంటున్నారు.

Sachin Tendulkar

ఈ మేరకు మధ్యప్రదేశ్ 'ఎన్నికల టెస్ట్'లో పార్టీకి సారథ్యం వహిస్తున్న జ్యోతిరాదిత్య సింధియా జట్టులోకి 'ప్రజాకర్షక ప్రచారకర్త' (స్టార్ క్యాంపెయినర్)గా ఎంపిక చేసిందని సమాచారం. దీనిపై సింధియా ఆయనతో చర్చించి ఒప్పిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయట.

ప్రముఖ పౌరుల కోటాలో ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టినందున ఇందుకు కాదనబోరని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోందంటున్నారు. మధ్యప్రదేశ్‌లో రాష్ట్రంలో ముఠా కుమ్ములాటలతో కునారిల్లుతున్న పార్టీని ఏకతాటిపై నడపడంలో సచిన్ ప్రజాకర్షక శక్తి ఇతోధికంగా తోడ్పడుతుందని అధిష్ఠానం భావిస్తోందట. కాగా, సచిన్ టెండుల్కర్, రేఖలను కొద్ది నెలల క్రితం రాజ్యసభకు నామినేట్ చేసిన విషయం తెలిసిందే.

English summary
After cricket, politics seems to be the next stop for cricketing legend Sachin Tendulkar. After master blaster of Indian cricket announced that he will quit playing after his 200th Test match, he has been shortlisted by Congress as 'star campaigner' for Madhya Pradesh Assembly polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X