మాజీ సీఎంకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు, గెలుపు కోసం కాళ్లు పట్టుకుంటారా ?
లోక్‌సభ ఎన్నికలకు భాజపా అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కర్ణాటకలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా కర్ణాటక బీజేపీలో ఇప్పుడు అసమ్మతి దుమారం రేగింది. కర్ణాటక కాంగ్రెస్ నాయకులు బీజేపీలో అంటుకున్న ఈ నిప్పుకు ఆజ్యం పోస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి ఆరోపణల మధ్య కాంగ్రెస్ పార్టీ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ పై ఓ ట్వీట్ చెయ్యడంతో అది వైరల్ అయ్యింది.
ఇప్పటికే బీజేపీ హైకమాండ్ ప్రకటించినట్లుగా కర్ణాటకలోని హవేరీ లోక్ సభ నియోజక వర్గం నుంచి మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ పోటీ చేస్తున్నారు. హావేరి లోక్‌సభ నియోజకవర్గం నుండి మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ కి బీజేపీ టికెట్ ఇచ్చింది. అయితే మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ మంత్రి వర్గంలో పని చేసిన మాజీ మంత్రి, బీజేపీ మాజీ ఎమ్మెల్యే బీసీ పాటిల్ ను మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ కలిశారు.

లోక్ సభ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ మాజీ మంత్రి బీసీ పాటిల్ మద్దతు కోరారు. ఇప్పుడు ఈ వీడియోపై కర్ణాటక కాంగ్రెస్ హేళన చేసింది. కాంగ్రెస్ చేసిన ట్వీట్‌లో మీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని మేము అనుకోలేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ ను ఏకిపారేస్తున్నారు. మీరు మాజీ ముఖ్యమంత్రి, వయస్సులో మీరు చాలా సీనియర్, చిన్న వయసు ఉన్న మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే బీసీ పాటిల్ కాళ్ల మీద మీరు పడిపోతారా? అంటూ మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ ని కాంగ్రెస్ ప్రశ్నించింది.
గో బ్యాక్ బోమ్మయ్ ప్రచారం మొదలు పెట్టకూడదని ముందస్తుగా మీరు మాజీ మంత్రి బీసీ పాటిల్ కళ్ల మీదపడిపోయారా అని కాంగ్రెస్ మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ ని ప్రశ్నించింది ఎంపీ టికెట్ దక్కని బీసీ పాటిల్‌లను బుజ్జగించడానికి వెళ్లిన బసవరాజ్ బోమ్మయ్ చివరికి ఆయన కాళ్ల మీదపడిపోవడానికి ప్రయత్నించడం నిజంగా మాజీ సీఎం దయనీయ స్థితికి అద్దం పడుతోందని కాంగ్రెస్ ట్వీట్ చేసింది.
ಛೇ ಇದೆಂತಹಾ ದುಸ್ಥಿತಿ @BSBommai ಅವರೇ,
— Karnataka Congress (@INCKarnataka) March 15, 2024
ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿಯಾಗಿ, ವಯಸ್ಸಿನಲ್ಲಿ ಹಿರಿಯರಾಗಿ ಕಿರಿಯ ವಯಸ್ಸಿನ ಬಿ ಸಿ ಪಾಟೀಲ್ ಕಾಲಿಗೆ ಬೀಳುವುದೇ?
“ಗೋ ಬ್ಯಾಕ್ ಬೊಮ್ಮಯಿ“ ಅಭಿಯಾನ ಶುರುವಾಗದಿರಲಿ ಎಂದು ಅಂಟಸಿಪೇಟರಿ ಬೇಲ್ ತೆಗೆದುಕೊಳ್ಳುತ್ತಿರುವುದಾ ಅಥವಾ ಟಿಕೆಟ್ ವಂಚಿತ ಪಾಟೀಲರನ್ನು ಓಲೈಸಿಕೊಳ್ಳುತ್ತಿರುವುದಾ?
ಬೊಮ್ಮಯಿಯವರ ಇಂತಹ… pic.twitter.com/tkhGwZzeqs
దీంతో బీజేపీ నేతలపై కర్ణాటక కాంగ్రెస్ మండిపడింది. మొత్తానికి కర్ణాటకలో పొలిటికల్ వార్ గా జరుగుతున్న ఈ రచ్చతో బీజేపీ పరువు తియ్యడానికి కర్ణాటకలోని కాంగ్రెస్ నాయకులు సిద్దం అయ్యారు. సోషల్ మీడియాలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల్లో లబ్దిపొందాలని ప్రయత్నిస్తున్నదని తెలిసింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ పై కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. కాంగ్రెస్ చేసిన ఈ వ్యంగ్యానికి బీజేపీ ఎలా స్పందిస్తుందో మరి వేచి చూడాల్సిందే అని బీజేపీ కార్యకర్తలు అంటున్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications