బీజేపీ దెబ్బ: ఒక్క ఎమ్మెల్యేని బయటకు వదలద్దు: కాంగ్రెస్ హైకమాండ్, మొత్తం రివర్స్ !
గుజరాత్ కు చెందిన 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రిసార్ట్ వదిలి బయటకురాకూడదని ఆ పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది.
బెంగళూరు: గుజరాత్ కు చెందిన 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రిసార్ట్ వదిలి బయటకురాకూడదని ఆ పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. రిసార్ట్ వదిలి బయటకు వస్తే బీజేపీ నాయకులు గాలం వేస్తారని కాంగ్రెస్ హై కమాండ్ హడలిపోయింది.
రాజ్యసభ ఎన్నికల సందర్బంగా ఆపరేషన్ కమల (బీజేపీ)తో భయం పట్టుకున్న కాంగ్రెస్ నాయకులు గుజరాత్ లోని సొంత పార్టీకి చెందిన 44 మంది ఎమ్మెల్యేలను బెంగళూరు నగర శివార్లలోని బిడిది సమీపంలోని ఈగల్ టన్ రిసార్ట్ కు తరలించారు.

ఈగల్ టన్ రిసార్ట్ లో బోరుకొడుతోందని ఎమ్మెల్యేలు నెత్తినోరు కొట్టుకుంటున్నారు. వారికి కర్ణాటకలోని మడికేరిలో సుందరమైన ప్రాంతాలు చూపించాలని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్ణయించారు. అంతే కాకుండా బెంగళూరులోని ప్రముఖ ప్రాంతాలు చూపించాలని నిర్ణయించారు.
సాఫ్ట్ వేర్ కంపెనీలు, దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు, పర్యాటక ప్రాంతాలు చూపించడానికి ప్లాన్ చేశారు. అయితే మంగళవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి ఓ ఫోన్ వచ్చింది. ఒక్క ఎమ్మెల్యేని కూడా రిసార్ట్ నుంచి బయటకు పంపించడానికి కుదరదని కర్ణాటక ప్రభుత్వ పెద్దలకు ఆదేశాలు జారీ అయ్యాయని సమాచారం.
అంతే ముందుగా నిర్ణయించిన మొత్తం ప్లాన్ తల్లకిందలు కావడంతో గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రిసార్ట్ కే పరిమితం అయ్యారు. ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దెబ్బకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
-
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
3,000 పెన్షన్, ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లు.. కేరళలో బీజేపీ మేనిఫెస్టో ఇదే.. -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత











Click it and Unblock the Notifications