గులాంనబీ ఆజాద్‌కు కరోనా పాజిటివ్: తనను కలిసినవారు నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్ కరోనా బారినపడ్డారు. తనకు కరోనా సోకినట్లు ట్విట్టర్ వేదికగా ఆయన వెల్లడించారు. హోంక్వారంటైన్లో ఉన్నట్లు తెలిపారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వ్యక్తులు కరోనా నిబంధనలను అనుసరించాలని కోరారు.

కాగా, దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే, అదేస్థాయిలో కోలుకుంటున్నవారు కూడా ఉండటం ఊరటనిచ్చే అంశం. గురువారం 10,28,622 కరోనా పరీక్షలను నిర్వహించగా.. 63,371 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 73,70,469గా నమోదైంది. గత 24 24 గంటల్లో 865 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 1,12,161కి చేరింది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 9,22,54,927 కరోనా పరీక్షలను నిర్వహించారు.

Congress Leader Ghulam Nabi Azad Tests Positive For Coronavirus

ఇక బుధవారం దేశ వ్యాప్తంగా 70,338 మంది డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు 64,53,779 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 8,04,528 యాక్టివ్ కేసులున్నాయి. కాగా, గత కొద్ది రోజులుగా కొత్త నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. మరోవైపు రికవరీ రేటు ఆశించినస్థాయికి మించి పెరుగుతోంది.

దాదాపు 87.56 శాతం మంది కరోనా నుంచి కోలుకుంటున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అంతేగాక, మొత్తం కేసుల్లో కేవలం 10.92 శాతం మాత్రమే యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది. మరణాల రేటు కూడా అత్యంత తక్కువగా నమోదవుతోంది. ప్రస్తుతం మరణాల రేటు 1.52 శాతానికి తగ్గిందని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+