వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు ఫార్ములా నమ్ముకున్న కాంగ్రెస్: హిట్టా - ఫ్లాపా..!?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో కొద్దిరోజులుగా కొనసాగుతూ వస్తోన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల దాడులు, జీఎస్టీ విధింపు, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇక యుద్ధానికి తెర తీసింది. ఇవ్వాళ్టి నుంచే దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు, ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని దేశ రాజధానిలో 144 సెక్షన్‌ను కూడా విధించారు. దీని తీవ్రత ఢిల్లీలో కొనసాగుతోంది.

Recommended Video

రాహుల్ ప్రధాని అవుతారు - స్వామిజీ జోస్యం *National | Telugu OneIndia
మోడీ సర్కార్‌పై దండయాత్ర..

మోడీ సర్కార్‌పై దండయాత్ర..

దీనికి ప్రారంభ సూచకంగా ఏఐసీసీ మాజీ అధినేత, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ.. పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్‌గా చేసుకున్నారు. ఘాటు వ్యాఖ్యలు సంధించారు. కేంద్ర ప్రభుత్వంతో అసలైన యుద్ధం మొదలైందని వ్యాఖ్యానించారు. మోడీ నియంతృత్వానికి భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

 నల్లచొక్కాతో..

నల్లచొక్కాతో..

ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పార్లమెంట్ సభ్యులు ఇవ్వాళ నల్లరంగు చొక్కాలను ధరించారు. కేంద్రంపై తమ నిరసను తెలియజేశారు. రాహుల్ గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే ఇవ్వాళ నల్లరంగు కుర్తా పైజామా ధరించి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు హాజరయ్యారు. నల్లరంగు తలపాగాను ధరించి ఆయన పార్లమెంట్ హౌస్‌కు వచ్చారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు ఆయనను పలకరించారు. నల్లరంగు తలపాగా, కుర్తా-పైజామా ధరించి హాజరు కావడంపై ఆరా తీశారు. ప్రతిపక్ష సభ్యులు ఆయనను అభినందించారు.

 ఛాంబర్‌లో చిట్‌చాట్..

ఛాంబర్‌లో చిట్‌చాట్..

ఈ సందర్భంగా పార్లమెంట్ భవనంలోని తన ఛాంబర్‌లో మల్లికార్జున ఖర్గే.. చిట్‌చాట్‌గా మాట్లాడారు. దేశంలో అప్రకటిత అత్యయిక పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల గొంత నొక్కడానికి కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు ఏజెన్సీలను ప్రయోగిస్తోందని మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఎలాంటి పురోగతి లేకపోయినప్పటికీ.. ఉద్దేశపూరకంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడిందని ధ్వజమెత్తారు. ఇబ్బందులకు గురి చేయాలనే ఉద్దేశంతోనే నేషనల్ హెరాల్డ్ భవనాన్ని సీజ్ చేయించిందని అన్నారు.

ఈడీ సమన్లపై..

ఈడీ సమన్లపై..

నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో మల్లికార్జున ఖర్గే కూడా ఈడీ అధికారుల విచారణకు హాజరైన విషయం తెలిసిందే. సుమారు ఆరుగంటల పాటు ఆయనను విచారించారు. కొత్త సమన్లనేవీ జారీ చేయలేదు. దీనిపైనా ఆయన స్పందించారు. ఒక్క సాక్ష్యాధారాలను కూడా ఈడీ అధికారులు సాధించలేకపోయారని, అయినప్పటికీ.. ఉద్దేశపూరకంగా దాడులను ప్రోత్సహిస్తోందని, మోడీషాహీ ఇకపై చెల్లదని ఖర్గే హెచ్చరించారు.

 చంద్రబాబు ఫార్ములా..

చంద్రబాబు ఫార్ములా..


కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమిపై ఇదివరకు చంద్రబాబు నల్లచొక్కాలను ధరించి యుద్ధానికి దిగిన విషయం తెలిసిందే. ఎన్డీఏ నుంచి బయటికి వచ్చిన ఆయన చాలారోజుల పాటు నల్లచొక్కాలను ధరించి కనిపించారు. అసెంబ్లీ సమావేశాలతో పాటు దేశ రాజధానిలో నిర్వహించిన నిరసన ప్రదర్శనల్లోనూ అదే డ్రెస్‌తో కనిపించారు. ఇప్పుడిదే ఫార్ములాను కాంగ్రెస్ అనుసరిస్తోంది. నల్లచొక్కాలను ధరించి నిరసనల్లో పాల్గొనాలని పార్టీ క్యాడర్‌కు పిలుపునిచ్చింది.

English summary
Congress leader Rahul Gandhi and Mallikarjun Kharge wears a black dress in protest..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X