మెకానిక్ రాహుల్- ఇచ్చట జాయింట్లు బిగించబడును
న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఊపులో ఉంది కాంగ్రెస్ పార్టీ. అదే జోరును తెలంగాణ సహా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోయే రాష్ట్రాల్లోనూ కొనసాగించాలనే పట్టుదలను ప్రదర్శిస్తోంది. దీనికి అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటోంది. వాటిని అంతే పక్కాగా ఎగ్జిక్యూట్ చేయడానికి అవసరమైన సంప్రదింపులు జరుపుతోంది.
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరంలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన కసరత్తును కూడా ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీ మొదలుపెట్టింది కూడా. దీనితో కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల హడావుడి నెలకొంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో వరుస భేటీలు ఏర్పాటవుతున్నాయి.

ఇవ్వాళ తెలంగాణ కాంగ్రెస్ నేతలతో అధిష్ఠానం సమావేశమైంది. వరుసగా రెండో రోజు కూడా ఎన్నికల వ్యూహాల కమిటీ భేటీ అయింది. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి సహా కొందరు సీనియర్లు ఇందులో పాల్గొన్నారు. దేశ రాజధానిలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ ఏర్పాటయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇందులో చర్చించారు.
అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ధీటుగా ఎలా ఎదుర్కోవాలనే విషయం మీద కాంగ్రెస్ పార్టీ జోరుగా మంతనాలు సాగిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలన్నీ ఏకమౌతోన్నాయి. బీజేపీయేతర పార్టీలన్నీ ఇటీవలే బిహార్‌లోని పాట్నాలో భేటీ అయిన విషయం తెలిసిందే.

ఈ పరిణామాల మధ్య- రాహుల్ గాంధీ ఇవ్వాళ ఢిల్లీలో విస్తృతంగా పర్యటించారు. సాధారణ పౌరుడిలా కలియతిరిగారు. ఈ సాయంత్రం ఆయన కరోల్ బాగ్‌కు వెళ్లారు. అక్కడున్న ఓ బైక్ మెకానిక్ షాప్‌ను సందర్శించారు. అక్కడి కార్మికులతో మాట్లాడారు. వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. బైక్‌ను రిపేర్ చేసే సమయంలో వర్కర్లు వినియోగించే స్టూల్‌పై కూర్చుని వారితో ముచ్చటించారు.

పనిలో పనిగా తానూ ఓ స్క్రూడ్రైవర్‌ను అందుకుని ఓ బైక్ నట్లను బిగించారు. బైక్ ఇంజిన్ పనితీరు గురించీ రాహుల గాంధీ.. అక్కడి వర్కర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పక్కనే ఓ లేథ్ మెషిన్ షాప్‌లోకి వెళ్లారు. అక్కడ తయారయ్యే పరికరాలపై ఆరా తీశారు. సుమారు 40 నిమిషాల పాటు కరోల్ బాగ్‌లోనే కలియతిరిగారాయన. సాధారణ పౌరులతో కలిసి స్నాక్స్ టేస్ట్ చేశారు. టీ తాగారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications