‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’గా రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్ర, 15 రాష్ట్రాల్లో 66 రోజులు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ మరో మహా యాత్రకు సిద్ధమైంది. భారత్ జోడో యాత్ర తరహాలో కొత్తగా మరో యాత్ర చేపట్టనుంది. దీనికి తొలుత భారత్ న్యాయ్ యాత్ర అని పెట్టిన కాంగ్రెస్.. ఇప్పుడు స్వల్ప మార్పు చేసింది. రాహుల్ గాంధీ నేతృత్వం వహించే ఈ యాత్రకు భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nay Yatra) అని నామకరణం చేశారు. ఈ మేరకు వివరాలను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ గురువారం వెల్లడించారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే నేతృత్వంలో గురువారం కీలక సమావేశం జరిగింది. పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇంఛార్జీలు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు పాల్గొన్నారు. ఈ భేటీలోనే యాత్ర పేరు మార్పుపై నిర్ణయం తీసుకున్నట్లు జైరాం రమేష్ తెలిపారు. భారత్ జోడో న్యాయ్ యాత్రకు ఇండియా కూటమి నేతలందరినీ ఆహ్వానించినట్లు తెలిపారు.

జనవరి 14న ప్రారంభమయ్యే ఈ యాత్ర మార్చి 30న ముగుస్తుంది. 66 రోజులపాటు 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల మీదుగా దాదాపు 6713 కిలోమీటర్లపాటు యాత్ర కొనసాగనుంది. దాదాపు 100 లోక్‌సభ స్థానాల్లో చేపట్టే ఈ యాత్రలో అన్ని వర్గాల ప్రజలతో రాహుల్ గాంధీ మాట్లాడతారని జైరాం రమేష్ తెలిపారు. మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో ప్రారంభమయ్యే ఈ యాత్ర.. అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమబెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలో సాగనుంది.
తొలి దశలో జరిగిన భారత్ జోడో యాత్ర పూర్తిగా పాదయాత్ర కాగా.. భారత్ జోడో న్యాయ్ యాత్ర మాత్రం ఎక్కువగా బస్సుల్లో సాగనుంది. అక్కడక్కడా పాదయాత్ర ఉంటుందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. గతంలో రాహుల్ గాంధీ.. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 136 రోజులపాటు 12 రాష్ట్రాల్లో దాదాపు 4500 కిలోమీటర్ల మేర జోడో యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. రాహుల్ యాత్ర ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications