మిజోరంపై బాంబులేసిన రాజేష్ పైలట్ ? అడ్డంగా దొరికిన బీజేపీ ! సచిన్ చురకలు..

కాంగ్రెస్ పై నిత్యం సోషల్ మీడియాలో ఎడా పెడా విమర్శలు గుప్పించే అధికార బీజేపీ నేతలు ఇవాళ అడ్డంగా దొరికారు. ఒకప్పటి కాంగ్రెస్ దిగ్గజ నేత, దివంగత రాజేష్ పైలట్, మరో కాంగ్రెస్ నేత సురేష్ కల్మాడీ 1966లో మిజోరం రాజధాని ఐజ్వాల్ పై బాంబులు వేశారంటూ బీజేపీ ఐటీ సెల్ ఇన్ ఛార్జ్ తాజాగా ఓ ట్వీట్ చేశారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తమ పార్టీ నేతలతో స్వదేశంలోని ప్రాంతాలపైనే బాంబులు వేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో కలకలం రేపింది.

బీజేపీ ఐటీ సెల్ ఇన్ ఛార్జ్ అమిత్ మాలవీయ చేసిన ఈ ఆరోపణలు తప్పని నిరూపించేలా ఆయన కుమాడు, రాజస్తాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ఇవాళ ఆధారాలు బయటపెట్టారు. తన తండ్రి 1966 మార్చి 5న మిజోరం రాజధానిపై బాంబులేశారంటూ చేసిన ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు. తన తండ్రి 1966 అక్టోబర్ 29న ఎయిర్ ఫోర్స్ లో చేరితే మార్చి 5న ఎలా బాంబులేస్తారంటూ ప్రశ్నించారు. దీంతో బీజేపీ నేత అమిత్ మాలవీయ అడ్డంగా దొరికినట్లయింది.

congress leader sachin pilots strong counter to amit malaviyas tweet on late rajesh pilot

అంతటితో ఆగకుండా సచిన్ పైలట్.. తన తండ్రి సైన్యంలో ఎప్పుడు చేరారో చెప్పే ఓ ఆధారాన్ని కూడా బయటపెట్టారు. తన తండ్రి రాజేష్ పైలట్ జాయినింగ్ డేట్ తెలిపే సర్టిఫికెట్ ను కూడా తన ట్వీట్ కు జత చేశారు. అంతే కాదు రాజేష్ పైలట్ బాంబులేసింది మిజోరంపై కాదు బాబూ.. 1971 భారత్-పాక్ యుద్ధంలో ప్రత్యర్ధిపై అని స్పష్టం చేసారు. కాబట్టి మీరు చెప్పిన తేదీలు, ప్రాంతం తప్పు. బాంబులేసింది మాత్రమే నిజం అని సచిన్ పైలట్ తేల్చిచెప్పేశారు. దీంతో బీజేపీ ఇరుకునపడింది.

అంతకు ముందు అమిత్ మాలవీయ పెట్టిన ట్వీట్ వీడియోలో 57 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటూ జాతీయ మీడియా ఛానల్ ఏబీపీలో వచ్చిన ఓ కథనాన్ని జత చేశారు. దీంతో దివంగత కాంగ్రెస్ నేత రాజేష్ పైలట్ తన సహచరుడు సురేష్ కల్మాడీతో కలిసి నిజంగానే బాంబులేశారా అనే ప్రశ్నలు తలెత్తాయి. దీనికి సచిన్ పైలట్ ఇచ్చిన జవాబుతో అదంతా ఒట్టిదేనని తేలిపోయింది. దీంతో ఇప్పుడు సచిన్ పైలట్ సమాధానం ట్వీట్ ను కాంగ్రెస్ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+