రాహుల్ గాంధీ పేరు మీద హంపీలోని జూలో తెల్ల పులిని దత్తత తీసుకున్న కాంగ్రెస్ నేతలు , 51 వ బర్త్ డే స్పెషల్ !
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ 51 వ పుట్టినరోజు సందర్భంగా కర్ణాటకలోని విజయనగర జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బృందం అర్జున అనే తెల్ల పులిని హంపిలోని అటల్ బిహారీ వాజ్‌పేయి జూలాజికల్ పార్క్‌లో ఒక సంవత్సరం పాటు దత్తత తీసుకున్నారు. రాహుల్ గాంధీ పేరు మీద ఈ తెల్ల పులిని దత్తత తీసుకున్నారు.

రాహుల్ బర్త్ డే సందర్భంగా బళ్ళారి మరియు విజయనగర గ్రామీణ యువజన కాంగ్రెస్ నేతలు నిర్ణయం
బళ్ళారి మరియు విజయనగర గ్రామీణ కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడు సిద్దూ హల్లెగౌడ మరియు అతని స్నేహితులు జూన్ 19 న దత్తత తీసుకోవడానికి కర్ణాటక జూ అథారిటీకి రూ .1 లక్ష మొత్తాన్ని జమ చేశారు. రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా తాము కొన్ని సామాజిక కార్యక్రమాలను చేయాలనుకుంటున్న క్రమంలో , జంతుప్రదర్శనశాలలు నిధుల కొరతను ఎదుర్కొంటున్నందున కాంగ్రెస్ నాయకుడైన రాహుల్ గాంధీ పేరు మీద పులిని దత్తత తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని హల్లెగౌడ పేర్కొన్నారు.

అర్జున అనే తెల్ల పులిని దత్తత తీసుకున్న కాంగ్రెస్ నాయకులు
జూ అధికారుల ప్రకారం, దత్తత ప్రక్రియ సాధారణంగా ఆన్‌లైన్‌లో జరుగుతుంది .ఈ ప్రక్రియలోత్వరగానే ధృవీకరణ పత్రం ఇవ్వబడుతుంది. కాంగ్రెస్ నాయకులు జంతుప్రదర్శనశాలను సందర్శించి, వారు దత్తత తీసుకున్న పులిని చూడాలని కోరుకున్నందున, వారి సందర్శనకు అనుమతి ఇవ్వబడింది అని జూ అధికారి ఒకరు తెలిపారు.ఇటీవల, కర్ణాటక అటవీ శాఖ బ్రాండ్ అంబాసిడర్ అయిన కన్నడ నటుడు దర్శన్ తూగుదీపా, జంతుప్రదర్శనశాలలను నిర్వహించడానికి సహాయపడటానికి జూలోని జంతువులను దత్తత తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

జూలో జంతువులను దత్తత తీసుకోవాలని కన్నడ నటుడి విజ్ఞప్తి
కర్ణాటకలో జంతుప్రదర్శనశాలలలోని జంతువులను దత్తత తీసుకోవాలని నటుడు ప్రజలను విజ్ఞప్తి చేసిన తరువాత గత రోజులుగా చాలామంది జంతు ప్రేమికులు మరియు సంస్థల నుండి రూ కోటి రూపాయలకు పైగా దత్తత కార్యక్రమానికి జూ కు అందించారు. దత్తత తీసుకున్న వారిలో ఎక్కువ మంది బెంగళూరులోని మైసూరు మరియు బన్నర్‌ఘట్ట ప్రాంతాలనుండి వచ్చిన వారని కర్ణాటక జూ అథారిటీ అధికారులు తెలిపారు.

రాహుల్ గాంధీ పేరు మీద ఈ ఏడాది అర్జున తెల్ల పులి సంరక్షణ ఖర్చు అంతా వారిదే
భారత టైగర్ సంరక్షణ కార్యక్రమం అయిన ప్రాజెక్ట్ టైగర్ ను 1973 ఏప్రిల్‌లో కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆధ్వర్యంలో ప్రారంభించింది. అప్పటినుండి పులుల సంరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టడమే కాకుండా, వాటి సంరక్షణ కోసం దత్తత కార్యక్రమాలను కూడా కొనసాగిస్తున్నారు.ఇప్పుడు తాజాగా రాహుల్ గాంధీ పేరు మీద ఒక తెల్ల పులిని దత్తత తీసుకుని ఈ ఏడాది దాని సంరక్షణకు అయ్యే ఖర్చు అంతా వారే భరించనున్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications