వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీ స‌ర్కార్‌ క‌న్నా.. ఆనాటి రాజుల పాల‌నే గొప్ప‌ది.. బీజేపీపై కాంగ్రెస్ నేతల చిందులు

|
Google Oneindia TeluguNews

ప్రధాని మోదీని పాలనపై విమర్శలు కుప్పించారు కాంగ్రెస్ నేతలు. కేంద్ర ప్రభుత్వ విధానలతో దేశంలో పేదలు దుర్బర జీవితం గడుతున్నారని మండిపడ్డారు. నేటి బీజేపీ సర్కార్ కంటే నిరంకుశులైనప్పటికీ నాటి మహారాజుల పాలనే గొప్పగా ఉండేదని కాంగ్రెస్ పార్టీ గులాం నబీ ఆజాద్‌ మండిపడ్డారు. వీరి నిర్వాహకంతో జమ్ము-కాశ్మీర్ పేదరికంలో మునిగిపోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాపార కార్యకలాపాలు పూర్తి నిలిచిపోయాయని దుయ్యబట్టారు.

బీజేపీ సర్కార్ కన్నా.. నాటి మహారాజు పాలనే నయం

బీజేపీ సర్కార్ కన్నా.. నాటి మహారాజు పాలనే నయం

జమ్ము-కశ్మీర్ ప్రజల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాసిందని ఆరోపించారు ఆజాద్. నాటి మహారాజులు కల్పించిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందని విమర్శించారు. రాష్ట్రంలోని భూములు, ఉద్యోగాలపై స్థానికులకు మాత్రమే హక్కులు ఉండేలా నాటి మహారాజా హరిసింగ్‌ ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు. కానీ మోదీ సర్కార్ తీసుకువచ్చిన 370 అధికరణం రద్దుతో ఆ సౌకర్యమూ రద్దయిందని మండిపడ్డారు. ప్రభుత్వ కార్యాలయాలు ఆరు నెలల పాటు శ్రీనగర్‌లో, మరో ఆరు నెలలు జమ్మూలో ఉండేలా దర్బారు తరలింపు కార్యక్రమాన్ని 1872లో మహారాజా గులాబ్‌ సింగ్‌ చేపట్టారని చెప్పారు. అయితే దాన్ని కూడా ప్రస్తుత లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా జూన్‌ 20న రద్దు చేశారని దుయ్యబట్టారు. తమకు ఉన్న ఈ మూడు హక్కులను కూడా లాక్కున్నారని ఆజాద్ విమర్శించారు.

ప్రచారాల్లో మోదీ ముందు..

ప్రచారాల్లో మోదీ ముందు..

కరోనా థర్డ్ వేవ్ వ్యాప్తి నేపథ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్ర‌సంగించిన తీరుపై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మ‌ల్లికార్జున ఖ‌ర్గే తీవ్రంగా స్పందించారు. కరోనా మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారని ఆరోపించారు. వైరస్ కట్టడిలో పనిచేయడం కంటే ప్రసంగాల వైపే మోదీ ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని విమర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయని ఖర్గే అన్నారు.

 రాజ్యాంగాన్ని మార్చేస్తారు.?

రాజ్యాంగాన్ని మార్చేస్తారు.?

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే దేశ రాజ్యాంగాన్ని మార్చేస్తుందని ఖర్గే ఆరోపించారు. ప్రధాని మోదీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో మాత్రం ప్ర‌తిరోజూ క‌నిపిస్తారు. కానీ.. పార్ల‌మెంట్‌ సమావేశాలకు మాత్రం గైర్హాజ‌ర‌వుతార‌ని తీవ్రంగా మండిప‌డ్డారు. ఉభయసభల్లో ప్ర‌తిష్టంభ‌న ఏర్ప‌డినప్పుడు.. ప్రధానిగా మోదీ పార్ల‌మెంట్‌కు హాజ‌రై, దానిని తొలగించాల్సింది పోయి.. పార్ల‌మెంట్ స‌మావేశాల‌కు డుమ్మా కొట్టార‌ని ఖర్గే విమ‌ర్శించారు. దేశంలో బీజేపీ పాలన పట్ల వ్యతిరేకత పెరిగిందని దుయ్యబట్టారు.

English summary
Ghulam nabi azad attack on BJP govt in Jammu kashmir .. Maharajas autocratic rules better than bjp govt
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X