వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌లో "పద్మ" అవార్డు చిచ్చు.. ఆజాద్‌పై సహచరుల ఘాటు వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

73వ గణతంత్ర దినోత్సవం పురష్కరించుకుని కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలందించినందుకుగాను ఈ ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలు వరించాయి. అంతవరకు బాగానే ఉంది. కానీ, కాంగ్రెస్ అసమ్మతి నేత గులాం నబీ ఆజాద్‌కు కేంద్రం పద్మ భూషణ్ అవార్డు ప్రకటించడంపై హస్తం పార్టీలో గందరగోళానికి దారి తీసింది. ఆజాద్ సహచరులే మిశ్రమంగా స్పందన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలోని పలువురు ఆజాద్‌ను అభినందనలతో ముంచెత్తగా.. మరికొందరు ఆయనపై విరుచుకుపడుతున్నాయి.

Recommended Video

Padma Awards 2022: తెలుగు రాష్ట్రాల్లో ఎవరెవరికంటే Bipin Rawat కు Padma Vibhushan | Oneindia Telugu
భట్టాచార్య

భట్టాచార్య"గులాం" అవ్వాలను కోవట్లేదు..

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ ఇన్ డైరెక్ట్ గులాం నబీ ఆజాద్‌పై విమర్శలు గుప్పించారు. పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్దదేవ్ భట్టాచార్య భట్టాచార్యకు కూడా కేంద్రం పద్మ భూషణ్ అవార్డును ప్రకటించింది. కానీ ఆయన దాన్ని తిరస్కరించారు. ఇదే విషయాన్ని జైరాం రమేష్ ప్రస్తావించారు. భట్టాచార్య "అజాద్" గా ఉండాలనుకుంటున్నారు.. "గులాం" అవ్వాలను కోవట్లేదంటూ గులాం నబీ ఆజాద్‌పై విరుచుపడ్డారు జైరాం రమేష్..

ఆజాద్‌పై సెటైర్లు..

అంతటితో ఆగకుండా మాజీ బ్యూరో క్రాట్ పీఎన్ హస్కర్ నాడు అవార్డును తిరస్కరించడం గురించి ఒక పుస్తకంలో వివరించిన పేజీలను కూడా జైరాం రమేష్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దేశంలో అత్యంత శక్తివంతమైన ప్రభుత్వ ఉద్యోగి పీఎన్ హస్కర్ 1973లో పీఎంవో నుంచి బయటకు వచ్చినప్పుడు కేంద్రం అతనికి పద్మవిభూషణ్ ను ప్రకటించింది. దీనికి హస్కర్ పుస్తకంలోని భాగానికి ఇది అత్యుత్తమమైనది.. అనుకరణ అర్హమైనది అంటూ క్యాప్షన్ జోడించి ట్వీట్ చేశారు జైరాం రమేష్..

3ప్రజాసేవను గుర్తించడం బాగుంది..

మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ,లోక్‌సభ ఎంపీ శశిథరూర్‌ మాత్రం గులాం నబీ ఆజాద్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అవతలి పక్షం ప్రభుత్వం కూడా ఒకరి ప్రజాసేవను గుర్తించడం బాగుందంటూ ట్విట్ చేశారు.

దేశం గుర్తించింది.. కాంగ్రెస్‌కు అవసరం లేదు

అటు కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ కూడా గులాం నబీ ఆజాద్‌ను అభినందించారు. నా సహచరుడు, సోదరుడు ఆజాద్ కు పద్మభూషణ్ పురస్కారం వరించింది. ప్రజా జీవితంలో ఆయన సేవలను దేశం గుర్తించింది.. కానీ కాంగ్రెస్‌కు ఆయన సేవలు అవసరం లేదంటూ కపిల్ సిబల్ సెటైర్లు వేశారు. ఆజాద్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్ చేశారు.

మోదీకి క‌న్నీళ్లు తెప్పించిన ఆజాద్‌


గతేడాది ఫిబ్రవరిలో గులాం నబీ ఆజాద్ రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేశారు. ఆసమయంలో ప్రధాని మోదీ ఆయన సేవలను ప్రశంసించారు. కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఏది ఏమైనా ఈ అవార్డుల వ్యవహరం కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి..

English summary
Kapil siibal said Nation recognises Azad Services but the Congress doesn’t need
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X