ఉత్తరాఖండ్ లో కామన్ సివిల్ కోడ్-బీజేపీ హామీపై కాంగ్రెస్ ఎద్దేవా-కేంద్రం పరిధిలో ఉంటే మీరెలా ?

ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోరులో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. రాష్ట్రంలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారం నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ.. తమ అమ్ముల పొదిలోని కామన్ సివిల్ కోడ్ అంశాన్ని బయటికి తీసింది. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు ఇరు పార్టీల మధ్య వార్ కు కారణమవుతోంది.

తాము మరోసారి అధికారంలోకి వస్తే ఉత్తరాఖండ్ లో ఉమ్మడి పౌరస్మృతి(కామన్ సివిల్ కోడ్)ను అమలు చేస్తామని ముఖ్యమంత్రి పుష్కర్ థామీ తాజాగా ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో బీజేపీ ఇచ్చిన హామీపై ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో చర్చ జరుగుతోంది. ఉత్తరాఖండ్ లో మాత్రమే ఉమ్మడి పౌరస్మృతి అమలుపైనా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ దిగ్గజ నేత, సీఎం అభ్యర్ధి కూడా అయిన హరీష్ రావత్ బీజేపీ ఇచ్చిన హామీపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర జాబితాలో లేని ఉమ్మడి పౌరస్మృతి అంశంపై మీరెలా హామీ ఇస్తారని సీఎం పుష్కర్ ధామీని ప్రశ్నించారు.

congress mocks bjps uniform civil code promise in uttarakhand, says its not state subject

నైనిటాల్ నియోజకవర్గంలోని లాల్కువా స్థానం నుంచి తొలిసారిగా పోటీ చేస్తున్న రావత్ పుష్కర్ థామీ హామీపై న్యూస్ 18తో మాట్లాడుతూ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు అనేది సమస్యే కాదన్నారు. సిట్టింగ్ సీఎం పుష్కర్ ధామీ ప్రధాని నరేంద్ర మోడీపై పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని రావత్ ఆరోపించారు. అఁదుకే ఉత్తరాఖండ్ ఎన్నికల్లో ఎప్పుడూ కీలక పాత్ర పోషించే స్ధానిక సమస్యల్ని వదిలిపెట్టి తన చేతుల్లో లేని కామన్ సివిడ్ కోడ్ పై ఆయన హామీ ఇచ్చారని రావత్ విమర్శించారు. సమస్యల్ని పక్కదారి పట్టించేందుకే బీజేపీ ఇలాంటి అంశాల్ని తెరపైకి తెస్తోందన్నారు. వీటిని ప్రజలు నమ్మే పరిస్దితి లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+