ఆరెస్సెస్ లోకి ప్రభుత్వ ఉద్యోగులు-కేంద్రం గ్రీన్ సిగ్నల్-నిక్కర్లతో వచ్చేయొచ్చని కాంగ్రెస్ సెటైర్లు..!

బీజేపీ సైద్ధాంతిక సంస్ధగా చెప్పుకునే ఆరెస్సెస్ లోకి ప్రభుత్వ ఉద్యోగుల చేరికపై 40 ఏళ్లుగా ఉన్న నిషేధాన్ని ఎత్తేస్తూ కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. గతంలో గాంధీజీ హత్యతో పాటు పలు కారణాలతో ఆరెస్సెస్ నిషేధాన్ని ఎదుర్కొంది. దీంతో అప్పటి ప్రభుత్వాలు నిషేధిత సంస్ధ ఆరెస్సెస్ లో ప్రభుత్వ ఉద్యోగులు చేరకుండా నిషేధం కొనసాగించాయి. ఇప్పుడు దాన్ని కేంద్రం ఎత్తేసింది. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది.

1948లో ఆరెస్సెస్ సభ్యుడు నాథూరామ్ గాడ్సే మహాత్మా గాంధీని హత్య చేసిన తర్వాత దాని కార్యకలాపాలపై ఆందోళనల కారణంగా తొలిసారి దీన్ని చట్టవిరుద్ధమైన సంస్థగా ప్రకటించారు. గాంధీజీ హత్య తర్వాత 1948 ఫిబ్రవరిలో సర్దార్ పటేల్ ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం విధించారని, ఆ తర్వాత సత్ప్రవర్తనకు హామీ ఇవ్వడంతో నిషేధాన్ని ఉపసంహరించుకున్నారని, ఆ తర్వాత కూడా నాగ్‌పూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ జెండా ఎగురవేయలేదని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ గుర్తుచేశారు.

congress mocks lifting ban on employees to join RSS says bureaucracy can now come in knickers

ఆ తర్వాత 1966లో ప్రభుత్వఉద్యోగులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తో పాటు ముస్లిం సంస్థ జమాత్-ఇ-ఇస్లామీ సభ్యత్వం తీసుకోవడం, కార్యకలాపాలలో పాల్గొనడానికి సంబంధించి నిషేధం విధించారు. దీంతో కేంద్ర సివిల్ సర్వీస్ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఈ రెండు సంస్థల్లో చేరడంపై నిషేధం కొనసాగుతోంది.

ఇప్పుడు ఆరెస్సెస్ లో చేరికపై నిషేధాన్ని కేంద్రం ఎత్తేసింది. దీనిపై స్పందిస్తూ జైరాం రమేశ్.. జూన్ 4 తర్వాత స్వయం ప్రకటిత నాన్ బయోలాజికల్ ప్రధానికీ, ఆరెస్సెస్ కూ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని, అందులో తిరిగి వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.కేంద్రం నిర్ణయంతో ఇప్పుడు ఉద్యోగులు నిక్కర్లలో ఆఫీసులకు రావొచ్చన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+