Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాహుల్ భారత్ జోడో యాత్రలో విషాదం- గుండెపోటుతో కాంగ్రెస్ ఎంపీ హఠాన్మరణం

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర పంజాబ్ లో సాగుతున్న తరుణంలో ఓ విషాదం చోటు చేసుకుంది. రాహుల్ తో పాటు నడిచేందుకు వచ్చిన జలంధర్ కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సంతోఖ్ సింగ్ చౌదరి ఆకస్మికంగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు.

పంజాబ్ కాంగ్రెస్ అగ్రనేతల్లో ఒకరైన సంతోఖ్ సింగ్ చౌదరి గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు ఆయన వచ్చారు. అయితే యాత్రలో నడుస్తున్న క్రమంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ను కాంగ్రెస్ నేతలు వెంటనే ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. సంతోఖ్ సింగ్ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

congress mp santokh singh sudden death with cardiac arrest in rahuls bharat jodo yatra

సంతోఖ్ సింగ్ మరణవార్త తెలియగానే పలువురు పీసీసీ అధ్యక్షులతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా పంజాబ్ తరలి వెళ్లారు. అక్కడే ఉన్న రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్లు సంతోఖ్ సింగ్ మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీ మరణవార్త సమాచారం తెలియడంతో తోటి కాంగ్రెస్ ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హుటాహుటిన పంజాబ్ బయలుదేరారు. ఎంపీ సంతోఖ్ సింగ్ హఠాన్మరణం తనను తీవ్రంగా కలచి వేసిందని, ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+