వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ పోలీసుల ఓవరాక్షన్: పార్లమెంట్ వద్ద కేరళ ఎంపీలపై దాడి.. లోపలికి వెళ్లేందుకు నో..

|
Google Oneindia TeluguNews

కేరళలో సిల్వర్ లైన్ సెమి స్పీడ్ రైల్ కారిడార్ ప్రాజెక్టును విపక్షాలు వద్దంటున్నాయి. దీనిని నిరసిస్తూ గురువారం కేరళ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. కొందరిపై చేయి కూడా చేసుకోవడం కలకలం రేపింది. నిరసన ప్రదర్శన తర్వాత విజయ్ చౌక్ వద్ద మీడియాతో మాట్లాడారు. తమ నిరసన కార్యక్రమం చేపడుతుంటే పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. కొందరినీ తోసి వేశారని తెలిపారు. ఈ సమయంలో ఎర్నాకులం ఎంపీ హిబీ ఎడెన్ మొహంపై గాయమయ్యింది. తోపులాటలో ఆయన గాయపడ్డారు. తమను ఎందుకు అడ్డుకుంటున్నారని పలక్కాడ్ ఎంపీ శ్రీకాంతన్ పోలీసులను అడిగారు.

 గాయపడలేదే..?

గాయపడలేదే..?

ఎంపీలు గాయపడ్డారనే అంశాన్ని పోలీసులు ఖండించారు. కొందరు మీడియా లాన్ వద్ద గల నార్త్ ఫౌంటెన్ బారికేడ్ నుంచి వచ్చారని.. మలయాళంలో నినాదాలు చేశారని ఢిల్లీ పోలీస్ పీఆర్వో సుమన్ నాల్వా తెలిపారు. వారిని బ్యారికేడ్ల వద్ద మాత్రమే అడ్డుకున్నామని చెప్పారు. వారు ఎంపీలు అని చెప్పారని.. అయితే ఐడీ కార్డులు చూపమని కోరామని పేర్కొన్నారు. అందుకు వారు నిరాకరించడంతో.. సెక్యూరిటీ పికెట్ వద్ద గల గేట్ నంబర్ 1 నుంచి సిబ్బందిని రావాలని కోరామని చెప్పారు. వారు వచ్చి ఎంపీలు అని చెప్పడంతో ముందుకు పంపించామని తెలిపారు.

మోడీతో విజయన్ భేటీ వేళ

మోడీతో విజయన్ భేటీ వేళ


కేరళ సీఎం పినరయి విజయన్.. ప్రధాని మోడీతో సమావేశం అయ్యారు. రైల్వే ప్రాజెక్టు గురించి డిస్కష్ చేస్తోన్న సమయంలోనే.. కాంగ్రెస్ ఎంపీలు నిరసన ప్రదర్శనకు దిగారు. మరోవైపు ఇదే అంశాన్ని లోక్ సభలో ఎంపీలు ప్రస్తావించారు. స్పీకర్‌ ఓం బిర్లాను కలిసి, పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

 వారికి ఆ అధికారం ఎక్కడిదీ..?

వారికి ఆ అధికారం ఎక్కడిదీ..?


ఘటనపై ఆర్ఎస్పీ ఎంపీ ప్రేమచందన్ మాట్లాడారు. ఎంపీలను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులకు ఏం అధికారం ఉందని అడిగారు. ఢిల్లీ పోలీసులు పార్లమెంట్ పరిధిలో ఎంపీలనే రాకుండా అడ్డుకోగలరా అని అడిగరు. ఇదీ ఎంపీలకు జరిగిన అవమానం అని.. దాడి చేయడం హేయనీయం అని చెప్పారు. కేరళ ప్రజల ప్రయోజనం కోసం కే రైల్ వద్దని విజయ్ చౌక్ నుంచి పార్లమెంట్ భవనం వద్దకు నిరసన ప్రదర్శన చేపట్టామని కాంగ్రెస్ ఎంపీ కే సురేశ్ తెలిపారు. కానీ వారిపై దాడి జరిగిందని, దారుణంగా కొట్టారని మండిపడ్డారు. ఘటనకు సంబంధించి రాజ్యసభ ఎంపీ కేసీ వేణుగోపాల్ కూడా వీడియోను ట్వీట్ చేశారు. ఢిల్లీ సర్కార్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. ఘటనకు సంబంధించి స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. ఎంపీలను తన ఛాంబర్‌కు పిలిచి మట్లాడారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు సమన్లు జారీచేస్తామని స్పీకర్ చెప్పారని సమావేశం తర్వాత ఎంపీలు తెలిపారు.

English summary
police stopping Congress MPs from the kerala state from marching to Parliament. mps marching to Parliament were stopped by the police
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X