ఇలా చేస్తే మోడీని ఓడించవచ్చు: మణిశంకర్, 'దేవుడేం కాదు, ఏకమై ఎదుర్కోవాలి'

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: తాజా ఎన్నికలు దేశంలో బీజేపీని తిరుగులేని శక్తిగా మార్చాయి. అయితే ఇదంతా మోడీ ఒక్కడి హవా వల్లే జరిగిందనేవారు లేకపోలేదు. మోడీ హవా ముందు ప్రతిపక్షాలు గల్లంతవుతుండటంతో వచ్చే ఎన్నికల నాటికైనా ఆయన్ను ఎదుర్కొనేందుకు ఇప్పటినుంచే వ్యూహాలు, ప్రణాళికలు సిద్దం చేసుకోవాల్సిన పరిస్థితి.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి మణిశంకర్ అయ్యర్ కాంగ్రెస్ కు కొన్ని విలువైన సూచనలు చేశారు. మోడీని ఎదుర్కోవాలంటే ఎలా సిద్దపడాలో వివరించారు. 2019 ఎన్నికల్లో గతంలో అనుసరించిన మహాకూటమి విధానం ద్వారానే బీజేపీని, మోడీని ఎదుర్కోగలమని ఆయన అభిప్రాయపడ్డారు.

మోడీకి ఓటు వేయనివారి సంఖ్య ఎక్కువే:

మోడీకి ఓటు వేయనివారి సంఖ్య ఎక్కువే:

కాంగ్రెస్ ఒక్కటే బీజేపీని ఎదుర్కోగలమని భావిస్తే అంతకన్నా మూర్ఖత్వం లేదన్నారు. కలిసికట్టుగా పోరాడితేనే 2019ఎన్నికల్లో విజయం దక్కుతుందన్నారు. ఇదే సమయంలో పలు విలువూన సూచనలు చేశారు. తాజా ఎన్నికలను విశ్లేషిస్తూ.. సీట్ల పరంగా చూసుకుంటే కాంగ్రెస్ కు పెద్ద నష్టమే జరిగినా.. 2014ఎన్నికల్లో 59శాతం మంది, 2017ఎన్నికల్లో 69శాతం మంది మోడీకి ఓటు వేయలేదన్న సంగతి గుర్తుచేశారు.

మళ్లీ 'యూపీఏ' కూటమి:

మళ్లీ 'యూపీఏ' కూటమి:

రాహుల్ గాంధీకి పార్టీలో ఎటువంటి ఇబ్బంది లేదని చెబుతూనే జాతీయస్థాయిలో ఆ పార్టీ బలహీనపడుతుందని మణిశంకర్ పేర్కొనడం గమనార్హం. కాంగ్రెస్ బలోపేతం కోసం దేశవ్యాప్తంగా యువతను పెద్ద ఎత్తున పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరముందని తెలిపారు.

గత 2004 ఎన్నికల స్పూర్తితో యూపీఏ మిత్రపక్షాలన్ని మళ్లీ ఏకం కావాలని మణిశంకర్ అయ్యర్ సూచించారు. అప్పట్లో సోనియాగాంధీ మిత్రపక్షాలను కలుపుకుపోయారని, ఇప్పుడు రాహుల్ ఆ బాధ్యతను తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. మహాకూటమి ఏర్పాటు కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాల్సిన అవసరముందని తెలిపారు.

మోడీ దేవుడేమి కాదు:

మోడీ దేవుడేమి కాదు:

మణిశంకర్ అయ్యర్ తరహాలోనే కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీని ఎదుర్కోవడానికి విపక్షాలన్ని ఏకం కావాల్సిన అవసరముందన్నారు. మోడీని అడ్డుకోవాల్సిన అవసరముందని, ఆయనేమి దేవుడు కాదని దిగ్విజయ్ పేర్కొన్నారు.
మతతత్వ శక్తులను వ్యతిరేకించే పార్టీలన్ని ఏకం కావాల్సిన అవసరముందని సూచించారు.

గోవా ఎమ్మెల్యే రాజీనామాపై ఇలా:

గోవా ఎమ్మెల్యే రాజీనామాపై ఇలా:

గోవా కాంగ్రెస్ కు ఎమ్మెల్యే విశ్వజిత్ రాణే గుడ్ బై చెప్పడం పట్ల దిగ్విజయ్ స్పందించారు. ఉదయం వరకు రాణె తమతో బాగానే ఉన్నారని, ఉదయం 10 గంటలకు పార్టీ విప్ పై సంతకం కూడా చేశారని గుర్తుచేశారు. అయితే ఆ తర్వాత జరిగిన బలపరీక్షకు గైర్హాజరయ్యారని చెప్పారు.

కాగా, గోవా ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా కాంగ్రెస్ అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో మాత్రం అలసత్వం వహించింది. ఆ రాష్ట్ర ఇంచార్జీగా దిగ్విజయ్ సింగ్ ఉండటంతో ఈ వైఫల్యంపై కాంగ్రెస్ నేతలంతా ఆయన్నే నిందిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress veteran Mani Shankar Aiyar has demanded that the party work towards cobbling a grand alliance of opposition parties while being willing to forego its leadership
Please Wait while comments are loading...