జమ్మూకశ్మీర్లో కాంగ్రెస్-ఎన్సీ-పీడీపీ సర్కార్ ? అబ్దుల్లా ఫ్యామిలీలో భిన్నాభిప్రాయాలు !
జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి పదేళ్ల విరామం తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఘన విజయం దిశగా దూసుకెళుతోంది. ఇవాళ ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత నుంచీ ఇరు పార్టీల కూటమి అభ్యర్ధులు పలు చోట్ల ముందంజలో ఉన్నారు. ఇండియా కూటమిలో భాగమైన ఈ రెండు పార్టీల జోరుతో విడివిడిగా పోటీ చేసిన బీజేపీ, ఆ పార్టీ పాత మిత్రపక్షం పీడీపీ కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం బీజేపీ 22, పీడీపీ 2 సీట్లలో మాత్రమే ఆధిక్యంలో ఉన్నాయి.
జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్రంలో బీజేపీ సర్కార్ నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ నేతలైన మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీని టార్గెట్ చేసి హౌస్ అరెస్టులు చేసింది. దీంతో వీరంతా బీజేపీ చేతుల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినా కాంగ్రెస్-ఎన్సీ కూటమితో కలవకుండా ఒంటరి పోరుుకు దిగిన మెహబూబా ముఫ్తీ పార్టీ పీడీపీ భారీ ఎదురుదెబ్బలు తినక తప్పలేదు. ఈ నేపథ్యంలో కశ్మీర్ రాజకీయాల్లో దిగ్గజ నేత అయిన ఫరూక్ అబ్దుల్లా స్పందించారు.

జమ్మూకశ్మీర్ లో తమ రాజకీయ ప్రత్యర్థి అయిన మెహబూబా ముఫ్తీతో పొత్తు పెట్టుకుని కూటమిగా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దంగా ఉన్నట్లు ఫరూక్ అబ్దుల్లా వెల్లడించారు. తమకు అవసరం లేకపోయినా ప్రభుత్వ ఏర్పాటులో పీడీపీ మద్దతు తీసుకుంటామన్నారు. ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే కలిసికట్టుగా ఉద్యమించాలన్నారు.
అయితే ఆయన కుమారుడు ఒమర్ మాత్రం పీడీపీతో కలవడాన్ని ఇష్టపడటం లేదు. అటు ముఫ్తీ కుమార్తె ఇల్తిజా కూడా ఇవన్నీ ఊహాగానాలే అన్నారు. అయితే ఎన్సీ, పీడీపీ జాతీయ స్ధాయిలో ఇండియా కూటమిలో భాగంగా ఉన్నాయి. అలాగే స్దానిక పార్టీల కూటమి గుప్తార్ అలయన్స్ లోనూ భాగస్వాములుగా ఉన్నాయి. అయినా విడిగా ఎన్నికల్లో పోటీ చేశాయి.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications