125 ఎన్సీపీ, 125 కాంగ్రెస్, మరో 38 భాగస్వామ్యపక్షాలకు.. మహారాష్ట్రలో కుదిరిన పొత్తు

ముంబై : మహారాష్ట్ర ఎన్నికలకు మరికొద్ది రోజుల్లో షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు పొత్తుల ఎత్తుల్లో బిజీగా ఉన్నాయి. ఇప్పటికే బీజేపీ-శివసేన ప్రాథమికంగా సీట్ల కేటాయింపుపై చర్చలు కూడా జరిపాయి. ఈ క్రమంలో విపక్ష కాంగ్రెస్-ఎన్సీపీ కూడా పొత్తులపై చర్చలు జరిపాయి. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్-ఎన్సీపీ చెరో 125 సీట్లలో పోటీచేయాలని భావిస్తున్నాయి. మిగతా 38 సీట్లను తమ భాగస్వామ్య పక్షాలకు కేటాయిస్తాయి.

మహారాష్ట్ర అసెంబ్లీలో 288 సీట్లు ఉండగా .. ఎన్సీపీ-కాంగ్రెస్ సీట్ల పంపకంపై క్లారిటీకి వచ్చాయి. చెరో 125 స్థానాల్లో పోటీ చేస్తామని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సోమవారం మీడియాకు తెలిపారు. మిగిలిన 38 సీట్లను తమ భాగస్వామ్య పక్షాలకు కేటాయిస్తామని ప్రకటించారు. ఈ సారి తమ స్థానాల్లో కొత్తవారికి సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్-ఎన్సీపీ పట్టున్న నియోజకవర్గాలను బదిలీ చేసుకుంటాయని నొక్కి వక్కానించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్సీపీ విడి విడిగా పోటీచేశాయి. అందుకోసం సీట్లు తగ్గాయని భావించాయి. అందుకోసమే ఈసారి కలిసి పోటీచేయాలనే నిర్ణయానికి వచ్చాయి.

Congress, NCP to contest 125 seats each in Assembly polls

2014 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 122 సీట్లతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. 42 సీట్లతో కాంగ్రెస్, 41 సీట్లతో ఎన్సీపీ ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. ఐదేళ్ల క్రితం ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలు విడివిడిగా పోటీచేశాయి. అందుకోసమే సీట్లు సాధించలేకపోయామని భావిస్తున్నాయి. ఇప్పుడు కలిసి పోటీచేయాలని డిషిషన్ తీసుకున్నాయి. అయితే ఎన్సీపీ, కాంగ్రెస్ నుంచి ముఖ్య నేతలు బీజేపీలో చేరడం ఆ రెండు పార్టీలకు మింగుడుపడని విషయం. ఈ క్రమంలో కలిసి పోటీ చేసి మెజార్టీ సీట్లు సాధిస్తామని బీరాలు పలుకుతుంది. కానీ బీజేపీ మాత్రం మరింత బలంగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+