ప్రచారంలో కాంగ్రెస్ న్యూ స్ట్రాటజీ .. జలమార్గం ద్వారా ప్రియాంక క్యాంపెయిన్
Recommended Video

న్యూఢిల్లీ : ఓట్ల పండుగ రావడంతో వయోజనులను ఆకట్టుకునేందుకు నేతలు పాట్లు పడుతున్నారు. విభిన్న రకాలుగా ప్రచారం చేసి ఓట్లు దండుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తమ ప్రచారం ద్వారానే ప్రజల నోళ్లలో నానుతూ .. ఓటు బ్యాంకుగా మలచుకోవాలని భావిస్తున్నారు.

జలమార్గంలో ప్రియాంక
భారత రాజకీయాల్లో ఇదివరకు ఎన్నడూ లేని పంథాను ఎంచుకున్నారు కాంగ్రెస్ పార్టీ తురుపుముక్క, స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీ. జలమార్గం ద్వారా ప్రచారం చేసి జనాలను ఆకట్టుకోవాలని యోచిస్తున్నారు. ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు ప్రయోగ్ రాజ్ నుంచి వారణాసి వరకు గంగానదీపై ప్రయాణించి .. నదీ పరివాహక ప్రజలతో మమేకమవుతారని కాంగ్రెస్ పార్టీలు పేర్కొన్నాయి.

మోటార్ బోట్ లో ప్రయాణం ..
ప్రయాగ్ రాజ్ నుంచి వారణాసి వరకు వంద కిలోమీటర్ల మేర మోటార్ బోట్ లో పయనిస్తారు. ఆ సమయంలో చిన్న పట్టణాలు, పల్లెల్లో ప్రజలను పలుకరిస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. వరదల వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు, ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రధానంగా ప్రస్తావిస్తారని తెలుస్తోంది.

గంగానదీ ప్రక్షాళన పనులు పరిశీలన
ప్రధాని మోదీ గొప్పగా చెప్పిన గంగానదీ ప్రక్షాళన పనులను పరిశీలిస్తారు. అక్కడ జరుగుతోన్న లోపాలను ఎత్తిచూపే ఆస్కారం ఉంది. జడోహి, మీర్జాపూర్ మీదుగా సాగే పర్యటనలో చిన్న గ్రామాల్లో కూడా సభలు నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు.

వింధ్యమాత దర్శనంc
జలమార్గ పర్యటనలో భాగంగా ప్రియాంక గాంధీ మీర్జాపూర్ లోని వింధ్యవాహినీ మాత ఆలయాన్ని, కాశీలో విశ్వనాథుడిని దర్శించుకోని ప్రత్యేక పూజలు చేస్తారు. దీంతోపాటు తీరం వెంబడి ఉన్న మాల్హా, కేవత్, నిషాద్ కులాలకు చెందిన వారిని కలిసి సమస్యలను తెలుసుకుంటారు.












Click it and Unblock the Notifications