PM Kisan: ఎల్లుండి పోలింగ్ -ఇవాళ పీఎం కిసాన్ నిధులా ? కేంద్రంపై కాంగ్రెస్ విమర్శలు..
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ముఖ్యంగా మిజోరం, తెలంగాణను మినహాయిస్తే
కాంగ్రెస్, బీజేపీ మధ్య ముఖాముఖీ పోరు సాగుతోంది. ఇలాంటి సమయంలో కేంద్రం ఈ ఏడాది పీఎం కిసాన్ నిధుల్ని ఇవాళ రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. దీంతో ఈ నిధుల విడుదల బీజేపీ అవకాశాల్ని మెరుగుపర్చుకునే కుట్రలో భాగమేనని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అదీ మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ ఎన్నికల పోలింగ్ కు రెండు రోజుల ముందు ఈ నిధుల విడుదల ఏంటని ప్రశ్నిస్తోంది..
ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో అసెంబ్లీ ఎన్నికలకు కేవలం రెండు రోజుల ముందు పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి 15వ విడత నిధుల్ని విడుదల చేయడాన్ని కాంగ్రెస్ ఇవాళ ప్రశ్నించింది. ఇది ఉద్దేశపూర్వకంగా ఉందా అని నిలదీసింది. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న ఒకే దశలో పోలింగ్ జరగనుండగా, పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో రెండో విడత పోలింగ్ నిర్వహించనున్నారు. ఛత్తీస్ ఘడ్ లో ఇప్పటికే మొదటి దశ నవంబర్ 7న పూర్తయింది.

పీఎం కిసాన్ నిధుల్ని కేంద్రం గత కొన్నేళ్లుగా ఎప్పుడెప్పుడు విడుదల చేస్తోందో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఇవాళ ట్వీట్ చేశారు. ఇందులో పీఎం-కిసాన్ సమ్మాన్ నిధి ఆరో విడత 2020 ఆగష్టు 1న విడుదల చేశారని, తొమ్మిదో విడత 2021 ఆగష్టు 9న విడుదల చేశారని, 12వ విడత గత ఏడాది అక్టోబర్ 17న విడుదల చేశారన్నారు. ఇప్పుడు 15వ విడత మాత్రం నవంబర్ 15న విడుదల చేస్తున్నారన్నారు. అయితే తాము మాత్రం ఛత్తీస్‌గఢ్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవడం, మధ్యప్రదేశ్‌లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు జైరాం రమేష్ తెలిపారు.












Click it and Unblock the Notifications