IT HUB: శివరాత్రి రోజు సినిమా చూపించిన కాంగ్రెస్, భారీ ట్రాఫిక్ దెబ్బతో ప్రజలు హడల్, పండుగ రోజు !

బెంగళూరు: బెంగళూరు ప్రజలకు రాబోయే 50 ఏళ్ల వరకు తాగునీటి సమస్య రాకూడదనే ఉద్దేశంతోనే మేకదాటు ప్రాజెక్టు నిర్మించాలని తాము పోరాటం చేస్తున్నామని కేపీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డీకే. శివకుమార్ అన్నారు. మేకదాటు ప్రాజెక్టు విషయంలో బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్దిగా పని చెయ్యడం లేదని మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ చీఫ్ డీకే. శివకుమార్ తో పాటు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. మేకదాటు ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న పాదయాత్ర బెంగళూరు నగరంలోకి ప్రవేశించింది. కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర కారణంగా బెంగళూరులో ట్రాఫిక్ ఇబ్బందులతో ప్రజలు నానా తిప్పలుపడ్డారు. అసలే బెంగళూరులో ట్రాఫిక్ సమస్యతో సతమతం అవుతున్న ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాదయాత్రతో నరకం చూస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మా పాదయాత్ర కారణంగా బెంగళూరు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అందుకే మేము క్షమాపణలు కోరుతున్నామని కేపీసీసీ నాయకులు సోషల్ మీడియాలో క్షమాపణలు చెబుతూ ట్విట్ చేశారు. శివరాత్రి రోజు బెంగళూరులోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ దెబ్బతో అసలు సిసలైన శివరాత్రి చూశామని, పండుగ రోజు మాకు ఇలాంటి ఇబ్బందులు ఏమిటని సామాన్య ప్రజలు మండిపడుతున్నారు.

మేకదాటు పాదయాత్ర

మేకదాటు పాదయాత్ర


మేకదాటు ప్రాజెక్టు విషయంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగడుతున్న కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 27వ తేదీన మేకదాటు రెండు విడత పాదయాత్ర మొదలైయ్యింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కేపీసీసీ చీఫ్ డీకే. శివకుమార్ తో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, వేలాది మంది నాయకులు మేకదాటు పాదయాత్రలో పాల్గొంటున్నారు.

బెంగళూరులో ఎంట్రీ

బెంగళూరులో ఎంట్రీ

మేకదాటు రెండో విడత పాదయాత్రం ఇప్పటికే బెంగళూరులోకి ప్రవేశించింది. మంగళవారం శివరాత్రి పండుగ రోజు కూడా బెంగళూరులోని అనేక ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాదయాత్రను కొనసాగించారు. శివరాత్రి పండుగ రోజు కూడా వేలాది మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మేకదాటు పాదయాత్రలో పాల్గొని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

బెంగళూరు ప్రజలకు 50 ఏళ్లు తాగునీటి సమస్య రాకూడదు

బెంగళూరు ప్రజలకు 50 ఏళ్లు తాగునీటి సమస్య రాకూడదు


బెంగళూరు ప్రజలకు రాబోయే 50 ఏళ్ల వరకు తాగునీటి సమస్య రాకూడదనే ఉద్దేశంతోనే మేకదాటు ప్రాజెక్టు నిర్మించాలని తాము పోరాటం చేస్తున్నామని కేపీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డీకే. శివకుమార్ అన్నారు. మేకదాటు ప్రాజెక్టు విషయంలో బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్దిగా పని చెయ్యడం లేదని మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ చీఫ్ డీకే. శివకుమార్ తో పాటు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు.

ట్విట్టర్ లో సింపుల్ గా సారీ చేప్పిన కాంగ్రెస్

ట్విట్టర్ లో సింపుల్ గా సారీ చేప్పిన కాంగ్రెస్


మేకదాటు ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న పాదయాత్ర బెంగళూరు నగరంలోకి ప్రవేశించింది. కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర కారణంగా బెంగళూరులో ట్రాఫిక్ ఇబ్బందులతో ప్రజలు నానా తిప్పలుపడ్డారు. అసలే బెంగళూరులో ట్రాఫిక్ సమస్యతో సతమతం అవుతున్న ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాదయాత్రతో నరకం చూస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మా పాదయాత్ర కారణంగా బెంగళూరు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అందుకే మేము క్షమాపణలు కోరుతున్నామని కేపీసీసీ నాయకులు సోషల్ మీడియాలో క్షమాపణలు చెబుతూ ట్విట్ చేశారు.

 శివరాత్రి రోజు సినిమా చూపించిన కాంగ్రెస్ లీడర్స్

శివరాత్రి రోజు సినిమా చూపించిన కాంగ్రెస్ లీడర్స్


శివరాత్రి పండుగ రోజు బెంగళూరులోని కంగేరి నుంచి కాంగ్రెస్ పాదయాత్ర మొదలైయ్యింది, నాయండనహళ్ళి జంక్షన్, బనశంకరి, కత్రిగుప్ప రింగ్ రోడ్డు, జయదేవ జంక్షన్ మీదుగా మంగళవారం రాత్రి బీటీఎం లేఔట్ లోని అద్వైత్ పెట్రోల్ బంకు వరకు చేరుకుంది. శివరాత్రి రోజు బెంగళూరులోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ దెబ్బతో అసలు సిసలైన శివరాత్రి చూశామని, పండుగ రోజు మాకు ఇలాంటి ఇబ్బందులు ఏమిటని సామాన్య ప్రజలు మండిపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+