ఊపిరిపీల్చుకున్న రాహుల్ గాంధీ, ఆ కేసులో బెయిల్, అరెస్టు భయం నుంచి బచావ్, ఏ కేసు?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ అరెస్టు భయం నుంచి తప్పించుకుని షరతులతో బెయిల్ పొందారు. గతంలో సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ బెయిల్‌ తీసుకుని అరెస్ట్‌ నుంచి తప్పించుకున్నారు. డీకే శివకుమార్ కూడా అరెస్టు చేస్తారన్న భయం ఉండేది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధినేతగా పేరు తెచ్చుకున్న రాహుల్ గాంధీకి కూడా బెయిల్ రావడంతో అరెస్ట్ అయ్యే అవకాశం లేదని న్యాయనిపుణులు చెందుతున్నారు.

అయితే ఇప్పుడు రాహుల్ గాంధీకి ఏ కేసులో బెయిల్ వచ్చింది? అనే విషయం గురించి ఆలోచిస్తే ఆయనకు కర్ణాటకలో బెయిల్ వచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించింది. గత బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ 40% కమీషన్‌ తీసుకున్నారని ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. తమపై తప్పుడు ఆరోపణలు చేశారని బీజేపీ నాయకులు ఆరోపించారు.

Congress party chief Rahul Gandhi has been granted conditional bail by a Bengaluru court

రాహుల్ గాంధీతో పాటు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌పై కూడా బీజేపీ నాయకులు ఆరోపణలు చేసి కేసులు పెట్టారు. రాహుల్ గాంధీ, సిద్దరామయ్య, డీకే శివకుమార్ మీద బీజేపీ కేసు పెట్టడంతో ఈ కేసు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. బీజేపీ నాయకులు పెట్టిన కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌కు కొన్ని రోజుల క్రితం బెయిల్ వచ్చింది.

అయితే ఈ కేసు విచారణలకు అప్పట్లో రాహుల్ గాంధీ హాజరుకాలేదు. ఇప్పుడు వీరికి కూడా ఈ కేసులో బెయిల్ వచ్చింది బెయిల్ రావడంతో రాహుల్ గాంధీ అరెస్టు నుంచి తప్పించుకున్నారని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఇంతకీ రాహుల్ గాంధీ బెయిల్ పై సంతకం చేసింది ఎవరు? అని కాంగ్రెస్ నాయకులు ఆరా తీశారు. ఈ కేసులో డీకే శివకుమార్ సోదరుడు, మాజీ ఎంపీ డీకే సురేష్ రంగంలోకి దిగారు.

2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సమయంలో బీజేపీ 40 శాతం కమీషన్లు తీసుకుందని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చెయ్యడంతో ఆ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. ఆ సమయంలో బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ, సిద్దరామయ్య, డీకే శివకుమార్ ల మీద కేసులు పెట్టారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేశారు. బెంగళూరులోని 42వ ఏసీఎంఎం కోర్టు విచారణకు రాహుల్ గాంధీ స్వయంగా హాజరయ్యారు.

ఈ కేసులో కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ బాండ్‌పై సంతకం చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్‌ మాజీ ఎంపీ డీకే సురేష్‌ బెయిల్ పేపర్ల మీద ష్యూరిటీ సంతకం చేయడంతో రాహుల్‌ గాంధీకి ఇప్పుడు ఊరట లభించినట్లు అయ్యింది. కర్ణాటక బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత రాహుల్ గాంధీ మరింత రిలాక్స్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+