మన్మోహన్ పై కాంగ్రెస్ నాయకులు అసంతృప్తి, ఆర్ బి ఐ గవర్నరే కారణమా?
ఆర్ బి ఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ను మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వెనుకేసురావడాన్ని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపి సందీప్ దీక్షిత్ తప్పుబట్టారు.
న్యూఢిల్లీ :రిజర్వ్ బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ ను మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వెనుక వేసుకురావడం సరైంది కాదని కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పుబడుతున్నారు.
ఆర్ బి ఐ గవర్నర్ ను ప్రశ్నించే హక్కు పార్లమెంట్ కమిటీలకు ఉంటుందని మాజీ ఎంపి సందీప్ దీక్షిత్ చెప్పారు.ఈ విషయమై మన్మోహన్ సింగ్ ఉర్జిత్ ను వెనుకేసుకు రావడం సరైందికాదన్నారు.

మన్మోహన్ సింగ్ అంటే తనకు గౌరవమని చెప్పారు. ఆర్ బి ఐ గవర్నర్ ను ఆయన వెనుకేసుకు రావడం సమంజసం కాదన్నారు. ప్రశ్నించే హక్కు ఎంపిలకు ఉందన్నారు.
ఆర్ బి ఐ లాంటి సంస్థలు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సి ఉందన్నారు.పాత నగదు నోట్ల రద్దు వివరణ పై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఎదుట హజరైన ఉర్జిత్ కు మన్మోహన్ సింగ్ అండగా నిలిచారు.












Click it and Unblock the Notifications