జయను చూడటానికి చెన్నై చేరుకున్న రాహుల్ గాంధీ
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషమించందని పుకార్లు రావడంతో జాతీయ స్థాయి రాజకీయ నాయకులు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం జయలలితను చూడటానికి చైన్నై బయలుదేరారు.
శుక్రవారం ఉదయం 11.45 గంటలకు రాహుల్ గాంధీ అపోలో ఆసుపత్రి చేరుకుని జయలలితను పరామర్శించనున్నారు. అనంతరం రాహుల్ గాంధీ అపోలో ఆసుపత్రి వైద్యులు, ఎయిమ్స్ వైద్యులతో అమ్మ ఆరోగ్యం విషయంపై చర్చించనున్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.

జయలలితను పరామర్శించిన తరువాత రాహుల్ గాంధీ బయటకు వచ్చి మీడియాతో ఏమి మాట్లాడుతారు ? అని జాతీయ మీడియా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. రాహుల్ గాంధీ అమ్మ ఆరోగ్యం విషయంలో కచ్చితమైన వివరాలు వెల్లడిస్తారని తమిళనాడు ప్రజలు భావిస్తున్నారు.
ఇటు తమిళనాడు ప్రజలతో పాటు, భారతదేశంలో ఉన్న జయలలిత అభిమానులు అందరూ టీవీలకు అతుక్కుపోయారు. రాహుల్ గాంధీ ఆసుపత్రి నుంచి ఎప్పుడు బయటకు వస్తారు ? ఏమి మాట్లాడుతారు అని అందరూ టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు.












Click it and Unblock the Notifications