
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో భారీ ట్విస్ట్ - రేపే ఫైనల్..!!
కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఎవరికి ఛాన్స్ దక్కనుంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి తాను పోటీ చేయటం లేదంటూ ఇప్పటికే రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పేరు ప్రముఖంగా వినిపించినా.. రాజస్థాన్ లో చోటు చేసుకున్న పరిణామాలను ఆయన ఆశలకు గండి కొట్టాయి. రాజస్ధాన్ పరిణామాల ను సోనియా సీరియస్ గా తీసుకున్నారు. అశోక్ గెహ్లాట్ కు కనీసం అప్పాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు. అధికారికంగా ఇప్పటి వరకు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తున్నారనే విషయంపై ఇంకా స్పష్టతం రావడం లేదు. సీనియర్ నేత ఆంటోనీతో సోనియా గాంధీ సమావేశమయ్యారు.

రేపు నామినేషన్లకు చివరి రోజు
నామినేషన్లకు
ఒక్క
రోజే
సమయం
ఉంది.
శుక్రవారంతో
నామినేషన్ల
గడువు
ముగియనుంది.
రేపు
మధ్నాహ్నం
లోగా
పోటీలో
ఉండే
నేతలు
నామినేషన్
దాఖలు
చేయాల్సి
ఉంది.
ఈ
సమయంలోనే
కమల్
నాధ్..
దిగ్విజయ్
సింగ్,
శశి
థరూర్
పేర్లు
రేసులో
ఉన్నాయి.
కాగా,
తాజాగా
కమల్
నాధ్
తాను
పోటీలో
ఉండటం
లేదని
తేల్చి
చెప్పారు.
శశిథరూర్
రేపు
నామినేషన్
వేస్తారని
సమాచారం.
ఇదే
సమయంలో
దిగ్విజయ్
సింగ్
శుక్రవారం
పార్టీ
అధ్యక్ష
పదవికి
నామినేషన్
వేసేందుకు
నిర్ణయించినట్లు
తెలుస్తోంది.
ఇక,
అధ్యక్ష
ఎన్నికకు
సంబంధించి
పార్టీ
నేత
వేణుగోపాల్
రాహుల్
తో
చర్చించారు.

సోనియా చెబితే బరిలోకి ఖర్గే
ఆయన కొద్ది సేపటి క్రితం ఢిల్లీ చేరుకొని, సోనియాతో సమావేశం అయ్యారు. గహ్లోత్‌పై వేరే మచ్చ లేకపోయినా, ఎమ్మెల్యేల ధిక్కార స్వరం విషయం ఆయనకు తెలియకుండా జరిగిన పరిణామం కాదని అధిష్ఠానం భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర మాజీ మంత్రి ఎ.కె.ఆంటోనీతో, మరికొందరు సీనియర్ నేతలతో సోనియా మాట్లాడారు. సోనియా అడిగినట్లయితే.. రాజ్యసభలో విపక్ష నేతగా ఉన్న మల్లికార్జున ఖర్గే ఈ పదవికి పోటీ చేస్తారని ఆయన సన్నిహిత నేతలు చెబుతున్నారు.

దిగ్విజయ్ వర్సస్ శశిథరూర్
నెహ్రూ-గాంధీ
కుటుంబానికి
విధేయుడిగా
ఉన్న
ఆయన
ఇటీవల
పార్టీ
అధ్యక్షురాలు
సోనియాను
కలిసి,
పార్టీ
ఏ
నిర్ణయం
తీసుకున్నా
అది
తనకు
శిరోధార్యమని
చెప్పారు.
ఈ
క్రమంలో
శశిథరూర్
..
దిగ్విజయ్
సింగ్
చివరి
రోజున
నామినేషన్
దాఖలు
చేసేందుకు
సిద్దమయ్యాు.
కానీ,
సోనియా
గాంధీ
కోరితే
తాను
పోటీ
చేస్తానని
ఖర్గే
చెప్పటంతో
ఇప్పుడు
అందరూ
సోనియా
నిర్ణయం
వైపు
చూస్తున్నారు.
సోనియా
దిగ్విజయ్
సింగ్
వైపు
సానుకూలత
వ్యక్తం
చేస్తే..చివరి
పోటీ
దిగ్విజయ్
సింగ్
-
శశి
థరూర్
మధ్య
జరిగే
అవకాశం
కనిపిస్తోంది.
దీంతో..రేపు
కాంగ్రెస్
అధ్యక్ష
ఎన్నికకు
సంబంధించి
ఫైనల్
అయ్యే
అవకాశం
కనిపిస్తోంది.