ఆచూకీ లేని సోనియా గాంధీ కమాండో! ఇంటినుంచి యూనిఫాంలో.. కానీ డ్యూటీకి రాలేదు!
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నివాసం వద్ద భద్రత చూసుకునే కమాండో కనిపించడం లేదు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపునకు చెందిన రాకేశ్ కుమార్(31) ఆచూకీ తెలియడం లేదు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నివాసం వద్ద భద్రత చూసుకునే కమాండో కనిపించడం లేదు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపునకు చెందిన రాకేశ్ కుమార్(31) ఆచూకీ తెలియడం లేదు.
ఈ నెల 3వ తేదీ నుంచి అతని జాడలేదు. తుగ్లక్ రోడ్ పోలీసులు ఎస్పీజీ కమాండో కోసం గాలిస్తున్నారు. కానీ ఇప్పటివరకు అతని ఆచూకీ చిక్కలేదు. సోనియా గాంధీ ఇంటి నుంచి వెళ్లిన అతను ఎక్కడికి వెళ్లాడో తెలియడం లేదు.

అతను అదృశ్యమైన రోజున మాత్రం డ్యూటీ చేయలేదు. కానీ ఇంటి నుంచి డ్యూటీ యూనిఫామ్‌లో వచ్చినట్లు తెలుస్తున్నది. వీవీఐపీ వ్యక్తులకు ఎస్పీజీ దళాలు ప్రత్యేక భధ్రతను కల్పిస్తాయి. అయితే కమాండో అదృశ్యం కావడంతో ఢిల్లీ పోలీసులు ఈ అంశాన్ని సిరీయస్‌గా తీసుకున్నాయి.
ఎస్పీజీ కమాండో రాకేశ్ కుమార్ తన కుటుంబంతో కలిసి ద్వారకాలోని సెక్టార్ 8లో నివసిస్తున్నాడు. తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. కమాండో రాకేశ్ సెప్టెంబర్ 1వ తేదీన సోనియా ఇంటి దగ్గర విధులు నిర్వర్తించాడు. అక్కడ తన సహ ఉద్యోగులను కూడా ఆ రోజున కలిశాడు.
అయితే అదే రోజున ఉదయం 11 గంటలకు బయటకు వెళ్లాడు. కానీ అతను సర్వీస్ రివాల్వర్ తీసుకెళ్లలేదు. మొబైల్ ఫోన్ కూడా తీసుకు వెళ్లని కారణంగా అతని ఆచూకీ చిక్కడం కష్టంగా మారింది.
రాకేశ్‌కు శత్రువులు ఎవరూ లేరని అతని కుటుంబసభ్యలు తెలిపారు. సెప్టెంబర్ 2న రాకేశ్ ఇంటికి వెళ్లలేదు. అయితే 3వ తేదీన ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లు జనపథ్ 10లో ఉన్న సోనియా సెక్యూరిటీకి చేరవేశారు.












Click it and Unblock the Notifications