కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి ఆరో అశోక్ రూ. 10 వేల కోట్ల స్కాం, ఇదిగో సాక్షం, కాంగ్రెస్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: కర్ణాటక మాజీ ఉప ముఖ్యంత్రి ఆర్. అశోక్ (బీజేపీ) కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ. 10 వేల కోట్లు నష్టం వచ్చిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కర్ణాటక రవాణా శాఖ, హోం శాఖ, ఉప మంత్రిగా పని చేసిన ఆర్. అశోక్ అధికారం అడ్డుపెట్టుకుని ప్రభుత్వ భూములు ఇష్టా రాజ్యంగా ఇచ్చేశారని కాంగ్రెస్ ఆరోపించింది.

సోమవారం బెంగళూరు నగరంలోని క్వీన్స్ రోడ్డులోని కేపీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉగ్రప్ప ఆర్. అశోక్ భూకుంబకోణం వ్యవహారంపై కీలక పత్రాలు విడుదల చేశారు. అనంతరం ఉగ్రప్ప మీడియాతో మాట్లాడుతూ ఆర్. అశోక్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Congress release to evidence against Former Karnataka DCM R Ashok

కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో ఆర్. అశోక్ 10 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు తనకు కావాలసిన వారికి, సన్నిహితులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నియమాలు ఉంఘించి కట్టబెట్టారని ఆరోపించారు. పేదలకు పంచిపెట్ట వలసిన ప్రభుత్వ పరోంబోకు భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మేశారని ఆరోపించారు.

అందుకు తగిన సాక్షాలు తమ దగ్గర ఉన్నాయని ఉగ్రప్ప మీడియాకు చెప్పారు. ప్రభుత్వ భూములు తీసుకున్న వారు కనీసం 15 ఏళ్లు ఎవ్వరికీ విక్రయించరాదని గుర్తు చేశారు. నియమాలు ఉల్లంఘించి పేదలకు కేటాయించినట్లు నటించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ భూములు దుర్వినియోగం చేసిన ఆర్. అశోక్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి మనవి చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress release to evidence against Former Karnataka DCM R Ashok
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి