వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

56 మందితో కాంగ్రెస్ 5వ వజాబితా.. ప్రణబ్ ముఖర్జీ తనయుడికి , ఉత్తమ్ కు చోటు

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ అధిష్టానం త్వరలో జరుగనున్న లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ఐదవ జాబితాను విడుదల చేసింది . ఈ జాబితాలో ఆంధ్ర ప్రదేశ్ నుండి 22 మందిని, తెలంగాణ రాష్ట్రం నుండి ఎనిమిది మందిని, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుండి 11 మందిని తమ పార్టీ అభ్యర్ధులుగా ప్రకటించింది. ఇక అస్సాం నుండి ఒడిశా నుంచి ఆరుగురిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి మిగిలిన మూడు సీట్లను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడైన అభిజిత్ ముఖర్జీని జంగీపూర్ లోక్ సభ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మొత్తం 137 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

Congress Releases Fifth List, Pranab Mukherjees Son, Uttam Kumar Reddy Among 56 Candidates

ఏపీ కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థుల జాబితా ఇదే

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ 132 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. అలాగే 22మంది అభ్యర్ధులను పార్లమెంట్‌కు ఎంపిక చేసింది. పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి కళ్యాణ దుర్గం నుంచి బరిలో నిలవగా.. పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులకు కూడా టికెట్లు ఇచ్చారు. మంగళగిరి, కుప్పం, పులివెందుల నుంచి కూడా పార్టీ అభ్యర్థులను బరిలో దింపింది. ఆంధ్రప్రదేశ్ ఎంపీ అభ్యర్థుల జాబితా:
1. అరకు - శృతిదేవీ
2. శ్రీకాకుళం - డోలా జగన్ మోహన్ రావు
3. విజయనగరం - యడ్ల ఆదిరాజు
4. అనకాపల్లి - శ్రీ రామమూర్తి
5. కాకినాడ - పల్లంరాజు
6. అమలాపురం - జంగా గౌతమ్
7. రాజమండ్రి - ఎన్.వి. శ్రీనివాస్ రావు
8. నరసాపురం - కనుమూరి బాపిరాజు
9. ఏలూరు - జెట్టి గురునాథరావు
10. మచిలీపట్నం - గొల్లు కృష్ణ
11. గుంటూరు - ఎస్‌కే మస్తాన్ వలీ
12. నరసరావుపేట - పక్కాల సూరిబాబు
13. బాపట్ల - జేడీ శీలం
14. ఒంగోలు - సిరివెల్ల ప్రసాద్
15. కర్నూలు - అహ్మద్ అలీఖాన్
16. అనంతపురం - కె. రాజీవ్ రెడ్డి
17. హిందూపూర్ - కె.టి. శ్రీధర్
18. కడప - జి.శ్రీరాములు
19. నెల్లూరు - దేవకుమార్ రెడ్డి
20. తిరుపతి - చింతా మోహన్
21. రాజంపేట - షాజహాన్ బాషా
22. చిత్తూరు - చీమల రంగప్ప

కాంగ్రెస్ నాలుగో జాబితా.. అక్కడినుంచే శశిథరూర్.. కేవీ థామస్ కు మొండిచేయికాంగ్రెస్ నాలుగో జాబితా.. అక్కడినుంచే శశిథరూర్.. కేవీ థామస్ కు మొండిచేయి

తెలంగాణా పార్లమెంట్ అభ్యర్థులు ఫైనల్

తెలంగాణ పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్‌ అధిష్టానం సోమవారం అర్ధరాత్రి విడుదల చేసింది. ఇప్పటికే 8 స్థానాలకు అభ్యర్థులను వెల్లడించిన కాంగ్రెస్.. మరో 8 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఖమ్మం లోకసభ స్థానం అభ్యర్థిని మాత్రమే కాంగ్రెస్ పెండింగులో పెట్టింది. ఈ సీటు కోసం నామా నాగేశ్వరరావుతో పాటు రేణుకా చౌదరి పోటీ పడుతుండడంతో అధిష్టానం సీటును పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తుంది.
ఇక టీపీసీసీ చీఫ్, హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని నల్లగొండ లోకసభ సీటుకు పోటీ చేయనున్నారు. మహబూబ్‌నగర్‌ స్థానానికి డీకే అరుణ, జి.మధుసూదన్‌రెడ్డి పేర్లపై చర్చ జరగగా ఈ స్థానానికి వంశీచంద్‌రెడ్డి పేరును అధిష్టానం ప్రకటించింది.హైదరాబాద్‌ నుంచి ఫిరోజ్‌ ఖాన్, సికింద్రాబాద్‌ నుంచి అంజన్‌కుమార్‌ యాదవ్, నాగర్‌కర్నూల్‌ నుంచి మల్లు రవి, భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నిజామాబాద్‌ నుంచి మధుయాష్కీ గౌడ్, ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానమైన వరంగల్‌ నుంచి దొమ్మాటి సాంబయ్య బరిలో నిలిచారు.

English summary
The Congress Monday night released its fifth list of 56 candidates for the Lok Sabha elections, including 22 from Andhra Pradesh and 11 from West Bengal.The list also included eight candidates from Telangana, six from Odisha and five from Assam, besides three remaining seats from Uttar Pradesh.The Congress has fielded former president Pranab Mukherjee's son Abhijit Mukherjee from Jangipur Lok Sabha seat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X