వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

UP Polls 2022: 125 మంది కాంగ్రెస్ అభ్యర్ధుల ప్రకటన - ఉన్నావ్ బాధితురాలి తల్లికి సైతం..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

భవిష్యత్ ఎన్నికలు సెమీ ఫైనల్స్ గా మారిన ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్ధుల ప్రకటన పైన పార్టీలు ఫోకస్ చేసాయి. బీజేపీ ఎన్నికల కమిటీ అభ్యర్ధుల ఎంపిక పైన సుదీర్ఘంగా కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ తమ పార్టీ నుంచి పోటీ చేసే 125 మంది జాబితాను కాంగ్రెస్ యూపీ ఇన్‌ఛార్జ్ ప్రియాంక గాంధీ ఖరారు చేసారు. ఈ జాబితాలో ఉన్నవో అత్యాచార బాధితురాలి తల్లి ఆశాదేవికి కి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని ఆ పార్టీ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నవో అత్యాచారం కేసు యూపీ ఎన్నికల్లో మరోసారి చర్చనీయాంశంగా మారనుంది.

Recommended Video

Assembly Elections 2022: Opinion Poll హోరాహోరీ పోరే | ABP-CVoter | Oneindia Telugu
ఉన్నావ్ బాధితురాలి తల్లికి టిక్కెట్

ఉన్నావ్ బాధితురాలి తల్లికి టిక్కెట్

ఈ ఘటనలో నిందితుడైన బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ జైలు పాలయ్యారు. అత్యాచార బాధిత బాలికను హతమార్చేందుకు బీజేపీ ఎమ్మెల్యే కుట్ర పన్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో బాధిత బాలికకు సుప్రీం అండగా నిలిచింది. తమ జాబితా పైన ప్రియాంక స్పందించారు. తమ అభ్యర్థుల్లో 40 శాతం మంది మహిళలే ఉంటారన్నారు. 125 మంది అభ్యర్థుల తొలి జాబితాలో 50 మంది మహిళలు ఉన్నారని ప్రియాంక గాంధీ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త రాజకీయాలకు నాంది పలుకుతూ కష్టపడుతున్న వారే మా అభ్యర్థులు కావాలని ప్రయత్నించామన్నారు.

మహిళలకు ప్రాధాన్యత

మహిళలకు ప్రాధాన్యత

ఈ జాబితాలో 50 మంది మహిళలకు టిక్కెట్లు కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త రాజకీయాలకు నాంది పలికే అభ్యర్థులు ఉండాలని మేం ప్రయత్నించామని..యూపీ రాజకీయాలకు కొత్త దిశానిర్దేశం చేయాలన్నదే తమ ప్రయత్నమని ప్రియాంక చెప్పుకొచ్చారు. కేంద్ర మాజీ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ భార్య లూయిస్‌ ఖుర్షీద్‌కు కూడా కాంగ్రెస్‌ టిక్కెట్‌ ఇచ్చింది. కాంగ్రెస్ నుంచి ఈ సారి పోటీ చేస్తున్న జాబితాలో ప్రముఖులు నోయిడా నుండి పంఖురి పాఠక్ లక్నో సెంట్రల్‌కు చెందిన సదాఫ్ జాఫర్, సదాఫ్ ఎన్‌ఆర్‌సి వ్యతిరేక ఉద్యమంలో జైలుకు వెళ్లారు. రాంపూర్ ఖాస్ నుండి ఆరాధన మిశ్రా (ప్రస్తుత ఎమ్మెల్యే) సోన్‌భద్ర ఊచకోత బాధితుల కోసం పోరాడిన నేత ఉంభా నుండి టిక్కెట్ షాజహాన్‌పూర్ నుండి ఆశా వర్కర్ పూనమ్ పాండేకి టిక్కెట్ హస్తినాపూర్‌కి చెందిన అర్చన గౌతమ్‌ ఉన్నారు.

జాబితా ఎంపికపై ప్రియాంక ముద్ర

జాబితా ఎంపికపై ప్రియాంక ముద్ర

కొందరు మహిళా జర్నలిస్టులు కూడా ఉన్నారని ప్రియాంక తెలిపారు. కాంగ్రెస్‌ను విడిచిపెట్టే నేతలపై ప్రియాంక గాంధీ మాట్లాడుతూ, "ప్రతి ఎన్నికల్లో ఇది జరుగుతుంది. కొంతమంది వస్తారు, మరికొందరు వెళతారు. కొందరు భయపడతారు. మన పోరాటానికి ధైర్యం కావాలి. ఎవరైనా వెళ్లిపోతే బాధ కలుగుతుందన్నారు. అటు బీజేపీ నుంచి సైతం జంపింగ్ లు కొనసాగుతున్నాయి. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. తొలి రెండు విడతలకు సంబంధించి జాబితాలను ఖరారు చేసే పనిలో బీజేపీ అధినాయకత్వం నిమగ్నమైంది. కాంగ్రెస్ 125 మందితో తొలి జాబితా విడుదల చేయగా.. మరో జాబితా రెండు రోజుల్లో విడుదల కానుంది. కరోనా ఆంక్షల నడుమ ఈ సారి ఎన్నికలు జరగనున్నాయి.

English summary
Congress released 125 candidate list for polls in Uttarapradesh elections, including mother of 2017 Unnao rape victim.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X