వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు సమాజ్ వాదీ సై, అఖిలేష్ కొత్త పార్టీ?

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.తొలి దశ నామినేషన్ల విడుదలకు ఈ నెల 17వ, తేది ప్రారంభం కానుంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో : ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.తొలి దశ నామినేషన్ల విడుదలకు ఈ నెల 17వ, తేది ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీతో పొత్తుకు కాంగ్రెస్ పార్టీ సన్నద్దం అవుతోంది. ఈ మేరకు రెండుపార్టీలు ప్రయత్నాలను ప్రారంభించినట్టుగా సంకేతాలు వస్తున్నాయి.అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడు ప్రియాంక గాంధీ, అఖిలేష్ సతీమణి డింపుల్ ఫోటోలతో పోస్టర్లు రూపొందించాడు.

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తోంది. సమాజ్ వాదీ పార్టీ కూడ ఇందుకు సానుకూలంగానే ఉంది.ఈ రెండు పార్టీలు కలిస్తే ఈ ఎన్నికల్లో బిజెపిని దెబ్బకొట్టే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు అఖిలేష్ కూడ సానుకూలంగానే ఉన్నాడు.ఎన్నికల ప్రచార సభల్లో కూడ ఆయన కాంగ్రెస్ పార్టీ తో పొత్తుకు సానుకూలంగా ఉన్నట్టుగా సంకేతాలు ఇచ్చాడు.

కాంగ్రెస్ పార్టీ కూడ ఈ విషయమై సమాజ్ వాదీ పార్టీతో పొత్తుకు సానుకూలంగా సంకేతాలను పంపుతోంది. దరిమిలా రెండు పార్టీలు కలిస్తే ఇరువురికి ప్రయోజనం కలిగే అవకాశాలున్నాయనే అభిప్రాయాలను రెండు పార్టీలకు చెందిన నాయకులు వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ తో పొత్తుకు సమాజ్ వాదీ పై

కాంగ్రెస్ తో పొత్తుకు సమాజ్ వాదీ పై

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు సమాజ్ వాదీ పార్టీ కూడ సానుకూలంగా ఉంది. ఈ రెండు పార్టీలు కనీస ఉమ్మడి కార్యక్రమం ద్వారా పొత్తును పెట్టుకోవాలని యోచిస్తున్నాయి. ఆయా పార్టీలకు గట్టిపట్టున్న సీట్లలో పట్టువిడుపులు ప్రదర్శించాలనే అభిప్రాయంతో ఉన్నారు రెండు పార్టీల నాయకులు.. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహూల్ గాంధీ, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ లు పొత్తు విషయమై భేటీ కానున్నారని సమాచారం. మరో వైపు పొత్తుకు సంబంధించి ఇప్పటికే మద్యవర్తులు, ఫోన్ల ద్వారా రెండు పార్టీల నాయకులు ఓ అవగాహనకు వచ్చారని సమాచారం.

సమాజ్ వాదీతో పొత్తుకు ఆర్ ఎల్ డి సానుకూలత

సమాజ్ వాదీతో పొత్తుకు ఆర్ ఎల్ డి సానుకూలత

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ కూడ పొత్తు కు సానుకూలంగా ఉందనే సంకేతాలను ఇచ్చింది.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు సానుకూలంగా ఉన్నారు.అయితే ఆర్ ఎల్ డి వంటి పార్టీలతో పొత్తు విషయమై సమాజ్ వాదీ ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

అఖిలేష్ కొత్త పార్టీ పెడతారా

అఖిలేష్ కొత్త పార్టీ పెడతారా

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కొత్త పార్టీ పెట్టేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారని ప్రచారం సాగుతోంది.అయితే ములాయం సింగ్ యాదవే అఖిలేష్ యాదవ్ పార్టీ పెట్టే అవకాశం ఉందని చెప్పడం విశేషం.అయితే తనసోదరుడు రామ్ గోపాల్ యాదవ్ కొత్త పార్టీ ఏర్పాటుకు రంగం సిద్దం చేస్తున్నారని ములాయంసింగ్ యాదవ్ ఆరోపణలు చేస్తున్నారు.ఈ పార్టీకి అఖిలభారత సమాజ్ వాదీ పార్టీ అనే పేరును పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ములాయం చెబుతుండం గమనార్హం.

మోటార్ సైకిల్ గుర్తు ను ఎంచుకోనున్న అఖిలేష్

మోటార్ సైకిల్ గుర్తు ను ఎంచుకోనున్న అఖిలేష్

కొత్త పార్టీని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నందున అఖిలేష్ యాదవ్ పార్టీ ఎన్నికల చిహ్నంగా మోటార్ సైకిల్ గుర్తుగా ఎంచుకొంటున్నారని చెబుతున్నారు. పార్టీ జాతీయ అధ్యక్ష పదవి విషయంలో ఇరువురి మద్య రాజీ కుదరలేదు. ఎన్నికల గుర్తు విషయంలో కూడ ఇరువర్గాలు కూడ అదే పట్టుదలతో ఉన్నాయి.అమర్ సింగ్, శివపాల్ యాదవ్ ను పార్టీ నుండి తప్పించాలనే డిమాండ్ పై ములాయం సింగ్ యాదవ్ మాత్రం ఈ డిమాండ్ ను సానుకూలంగా పరిష్కరించలేదు.

English summary
congress and samajwadei parties with alliance in uttarpradesh elections,two parties signal for alliance from both sides
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X