జీ20 లోగోలో కమలం ఎందుకు..? కాంగ్రెస్ ప్రశ్న, అందుకేనని బీజేపీ కౌంటర్

జీ 20 సదస్సుకు ఈసారి భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి సదస్సు జరగనుంది. ఏడాది పాటు జీ20 అధ్యక్ష దేశంగా భారత్ కొనసాగుతోంది. అయితే దానికి సంబంధించి లోగో, థీమ్, వెబ్‌సైట్‌ను ప్రధాని మోడీ ఇటీవలే ఆవిష్కరించారు. అందులో కమలం ఉంది. ఇదీ విమర్శలకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీ ఒంటికాలిపై లేచింది.

లోగోలో కమలం ప్రతిమ ఎందుకు పెట్టారని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఇదీ కరెక్ట్ కాదని ఫైరయ్యింది. 70 ఏళ్ల క్రితం జవహర్ లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ జెండాను జాతీయ జెండాగా పెట్టేందుకు అంగీకరించలేదని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ గుర్తుచేశారు.కానీ ఇప్పడు బీజేపీ మాత్రం జీ20 లోగోలో కమలం లోగో ఏర్పాటు చేసిందని విమర్శించారు. బీజేపీ చిహ్నాన్ని జీ20 లోగోగా ఎలా మారుస్తోందని మండిపడ్డారు.

Congress slams government over G20 logo

జైరాం రమేశ్ కామెంట్లను బీజేపీ తప్పుపట్టింది. కమలాన్ని జాతీయ పుష్పంగా కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రకటించిందని గుర్తుచేశారు. జీ 20 లోగోలో లోటస్ ఉపయోగించడంపై ఎందుకు అభ్యంతరం తెలుపుతుందో అర్థం కావడం లేదన్నారు. ఇదీ హిందువులకు అవమానం అని బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశ్ త్రివేది అన్నారు. పువ్వు లక్ష్మీ, సరస్వతీ దేవతతో ముడిపడిందని తెలిపారు.

జీ20 సదస్సు వెబ్‌సైట్‌, థీమ్‌, లోగోను ప్రధాని మోడీ ఆవిష్కరించారు. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఏడాది పాటు జీ 20 అధ్యక్ష దేశంగా భారత్ ఉంటుంది. ప్రపంచానికి భారత్ అందిస్తోన్న సందేశాన్ని వెబ్‌సైట్, లోగోలో పొందుపరిచారు. సదస్సుకు ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే మంత్రాన్ని భారత్ సూచించినట్టు ప్రధాని మోడీ తెలిపారు. కానీ లోగోపై మాత్రం వివాదం నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+