సైనిక బలగాల్ని అవమానిస్తారా ? చరిత్రలోనే చెత్త విదేశాంగ మంత్రి-కాంగ్రెస్ తీవ్ర విమర్శలు..

సైనిక బలగాల్ని ఉద్దేశించి విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. ఆయన చరిత్రలోనే ఓ చెత్త విదేశాంగమంత్రి అని కాంగ్రెస్ అధికారప్రతినిధి సుప్రియ విమర్శించారు.

చైనా సరిహద్దుల్ని కాపాడటంలో కేంద్రం వైఫల్యంపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలపై తాజాగా స్పందించిన విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ ప్రధాని మోడీ సరిహద్దులకు సైన్యాన్ని పంపారని, రాహుల్ గాంధీని కాదంటూ వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ మండిపడుతోంది.

జైశంకర్‌ను భారతదేశంలోనే అత్యంత విఫలమైన విదేశాంగ మంత్రని కాంగ్రెస్ విమర్శించింది. చైనాను ఉద్దేశించి చేసిన ఆరోపణతో ఇండో-చైనా సరిహద్దులో అన్ని అసమానతలను ధైర్యంగా ఎదుర్కొంటూ మన ప్రాదేశిక సమగ్రతను కాపాడుతున్న భారత సాయుధ బలగాలను అవమానించారని ఆరోపించింది. ఈ మేరకు కాంగ్రెస్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనటే తీవ్ర విమర్శలు చేశారు. భారతదేశంలో అత్యంత విఫలమైన విదేశాంగ మంత్రి నిన్న ఒక ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మనది అతి చిన్న ఆర్థిక వ్యవస్థ అని ఆయన అంటే చైనా పెద్ద ఆర్థిక వ్యవస్థ అని అన్నారు. వెళ్లి వారితో గొడవ పెట్టుకోలేనన్నారు. దీనర్ధం ఏంటి.. ? మనల్ని కాపాడుకోలేమని చెప్తున్నారా అని ఆమె ప్రశ్నించారు.

congress slams jaishankar for insulting armed forces, says indias most failed FM

సరిహద్దుల్లో నిలబడి మన ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునే ప్రజలకు, మనది చిన్న ఆర్థిక వ్యవస్థ అని, వారే పెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పాల్సిన అవసరం లేదని జైశంకర్ కు సుప్రియ హితవు పలికారు. వారితో మనం పోరాటం చేయకూడదట, విదేశాంగ మంత్రి చేసిన ప్రకటనలలో ఇది కూడా ఒకటన్నారు. చైనాలో ఎక్కువ కాలం పనిచేసిన భారత రాయబారి తానేనని జైశంకర్ చెప్తున్నారని, 2020 ఏప్రిల్‌లో యథాతథ స్థితిని ఎప్పుడు పునరుద్ధరిస్తారో, వాణిజ్య లోటును వంద బిలియన్ డాలర్లకు ఎందుకు పెంచుకున్నామో చెప్పాలని శ్రీనటే కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+