వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీ ములాయందే, అందుకే అలా చేశా: అఖిలేష్, కాంగ్రెస్‌తో పొత్తు

బీహార్ ఎన్నికల తరహాలో ఉత్తర ప్రదేశ్‌లోను బీజేపీని ఎదుర్కొనేందుకు గ్రాండ్ అలయెన్స్ సిద్ధమవుతోంది. కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ మంగళవారం నాడు అలెయన్స్ పైన స్పందించారు.

|
Google Oneindia TeluguNews

లక్నో: బీహార్ ఎన్నికల తరహాలో ఉత్తర ప్రదేశ్‌లోను బీజేపీని ఎదుర్కొనేందుకు గ్రాండ్ అలయెన్స్ సిద్ధమవుతోంది. కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ మంగళవారం నాడు అలెయన్స్ పైన స్పందించారు.

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ కూడా కాంగ్రెస్‌తో పొత్తు విషయంపై త్వరలో ప్రకటన చేయనున్నట్లు వెల్లడించారు. ఒకటి లేదా రెండు రోజుల్లో కాంగ్రెస్‌తో పొత్తు విషయాన్ని ప్రకటిస్తానన్నారు.

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎస్పీలో తండ్రి ములాయంకు, కుమారుడు అఖిలేశ్‌కు మధ్య నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సంఘం సైకిలు గుర్తును అఖిలేశ్‌కే కేటాయించడంతో ఆయన ఇక పొత్తుల దిశగా సమాయత్తమవుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేశ్‌ కాంగ్రెస్‌తో పొత్తును దాదాపు ఖరారు చేశారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, అఖిలేశ్‌ కలిసి ప్రచారంలో పాల్గొననున్నారని సమాచారం. అలాగే అజిత్‌ సింగ్‌కు చెందిన రాష్ట్రీయ లోక్‌ దళ్‌(ఆర్‌ఎల్‌డీ)తోనూ పొత్తు పెట్టుకోనున్నారు. యూపీలో బీజేపీ, బీఎస్పీ నుంచి పోటీ తట్టుకోవడానికి అఖిలేశ్‌ పొత్తు వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

పొత్తులపై ఆజాద్ మాట్లాడుతూ.. ఎస్పీతో కాంగ్రెస్ పొత్తుపై త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. అఖిలేష్ నేతృత్వంలో ఉమ్మడి కార్యాచరణతో ముందుకు వెళ్తామన్నారు.

Ghulam Nabi Azad

తండ్రితో విభేదాల్లేవు: అఖిలేష్

తనకు తన తండ్రి ములాయంతో విభేదాలు లేవని అఖిలేష్ చెప్పారు. ములాయం ప్రకటించిన 90 శాతం మంది మా జాబితాలో ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్‌తో పొత్తుపై త్వరలో చెబుతామన్నారు. పార్టీ ఎప్పుడూ ములాయందేనని, ఆయనను ఎప్పటికీ గౌరవిస్తానన్నారు.

ములాయం సింగ్‌కు భంగపాటు: కొడుక్కి 'ఈసీ' బూస్ట్.. అఖిలేష్‌కే 'సైకిల్'ములాయం సింగ్‌కు భంగపాటు: కొడుక్కి 'ఈసీ' బూస్ట్.. అఖిలేష్‌కే 'సైకిల్'

తమ మధ్య సంబంధాలు చెడిపోవన్నారు. అయితే పార్టీని తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తున్న అమర్ సింగ్‌, శివపాల్‌ యాదవ్‌ లాంటి వాళ్ల నుంచి ములాయంను, పార్టీని కాపాడడానికి ఇలా చేయాల్సి వస్తోందన్నారు.

తనపై ఇప్పుడు చాలా పెద్ద బాధ్యత ఉందన్నారు. మరోసారి ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీని అధికారంలోకి తీసుకురావడంపైనే తాను దృష్టి పెట్టానని అఖిలేశ్‌ చెప్పారు.

English summary
Congress, SP will fight UP polls in alliance, says Ghulam Nabi Azad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X