మిస్సింగ్ అంటూ స్మృతీ ఇరానీపై కాంగ్రెస్ పోస్టర్: యూఎస్‌లో వెతకాలంటూ కేంద్రమంత్రి కౌంటర్
న్యూఢిల్లీ: మిస్సింగ్ అంటూ తన ఫొటోతో కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేయడంపై కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ గట్టి కౌంటర్ ఇచ్చారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై బీజేపీ నేత మౌనంగా ఉన్నారని పేర్కొంటూ కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ మిస్సింగ్ పోస్టర్‌ను కాంగ్రెస్ పార్టీ బుధవారం సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అంతేగాక, రెజ్లర్ల నిరసన, పోలీసులు వారితో వ్యవహరించిన తీరు గురించి ప్రశ్నలు అడిగితే.. ప్రత్యుత్తరాలను మంత్రి సోషల్ మీడియాలో దాచారని కాంగ్రెస్ పార్టీ మరో ట్వీట్‌లో ఆరోపించింది . స్మృతి ఇరానీ, కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి ఫోటోను పోస్ట్ చేసింది. "ఒకరు ట్వీట్లను దాచారు", మరొకరు మహిళా రెజ్లర్ల ప్రశ్నలపై పారిపోతారు అని ఎద్దేవా చేసింది.

మీనాక్షి లేఖిని మీడియా ప్రతినిధులు రెజ్లర్ల నిరసనపై అడిగినప్పుడు ఆమె కారు వద్దకు పరుగెత్తుతున్నట్లున్న వీడియో వైరల్ కావడంతో కాంగ్రెస్ ఈ మేరకు స్పందించింది. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి స్మృతీ కూడా కాంగ్రెస్ పార్టీపై ఘాటుగా స్పందించారు.
తనను "తప్పిపోయినట్లు(మిస్సింగ్)" చూపిన కాంగ్రెస్ ట్వీట్‌పై స్పందిస్తూ.. "ఓ దైవిక రాజకీయ జీవి.. నేను ఇప్పుడే సిరిసిరా గ్రామం, విధానసభ సెలూన్, లోక్‌సభ అమేథి నుంచి ధురన్‌పూర్ వైపు బయలుదేరాను అంటూ స్మృతీ ఇరానీ కౌంటర్ ఇచ్చారు. మోడీ ఇంటిపేరు కేసులో దోషిగా తేలడంతో లోక్‌సభకు అనర్హత వేటు పడిన కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీని ఎగతాళి చేస్తూ.. "మాజీ ఎంపీ కోసం వెతుకుతున్నట్లయితే దయచేసి అమెరికాను సంప్రదించండి' అని ఇరానీ సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ ప్రస్తుత అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.
हे दिव्य राजनीतिक प्राणी , मैं अभी सिरसिरा गाँव , विधान सभा सलोन , लोक सभा अमेठी से निकली हूँ धूरनपुर की ओर । अगर पूर्व सांसद को ढूँढ रहे हो तो कृपया अमेरिका संपर्क करें । https://t.co/2rEUKLPCK8
— Smriti Z Irani (@smritiirani) May 31, 2023
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేయాలంటూ ప్రముఖ రెజ్లర్లు ఢిల్లీలో నెలరోజులుగా నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నూతన పార్లమెంటుకు మార్చ్ నిర్వహించగా.. రెజ్లర్లను అడ్డుకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విడిచిపెట్టారు. అయితే, నిరసనను తీవ్రతరం చేస్తూ తమ పతకాలను కూడా గంగా నదిలో పడేస్తామని మంగళవారం హరిద్వార్‌కు కూడా వెళ్లారు. రైతు నేతలు వారిని వారించడంతో ఆగిపోయారు. కేంద్రానికి ఐదు రోజుల డెడ్‌లైన్ విధించారు.
మరోవైపు, రెజ్లర్ల అంశంలో బ్రిజ్ భూషణ్ తనను ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారని తెలిపారు. ఏం జరుగుతుందో చూద్దాం? నా పదవీ కాలం ముగిసింది.. నేను దోషిగా తేలితే నన్ను అరెస్ట్ చేస్తారు.. దీంతో సమస్య ఏంటని ప్రశ్నించారు. తాను ఎలాంటి తప్పూ చేయలేదని, తప్పు చేశానని రుజువు చేస్తే తాను ఉరివేసుకుంటానని వ్యాఖ్యానించారు.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications